
కాశిబుగ్గ, వెలుగు: వరంగల్‌లో కడుపు నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన ఆర్నెళ్ల గర్భవతికి అబార్షన్అయ్యింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని మహిళ బంధువులు ఆరోపించారు. హాస్పిటల్ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. సిటీలోని కాశిబుగ్గకు చెందిన శ్రీవాణి ఆరు నెలల గర్భవతి. ఇటీవల చెకప్చేయించుకోగా కవలలు పుట్టే అవకాశం ఉందని, ఎనిమిదో నెల దాకా ఏ విషయం స్పష్టంగా చెప్పలేమని డాక్టర్లు ఆమెకు చెప్పారు. కాగా సోమవారం ఉన్నట్టుండి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు శ్రీవాణిని వెంకట్రామ జంక్షన్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు పరిశీలించి ఓ ఇంజక్షన్చేశారు. కొద్దిసేపటి తర్వాత శ్రీవాణికి అబార్షన్అయ్యింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు హాస్పిటల్ఎదుట ఆందోళనకు దిగారు. ఆ విషయం తెలుసుకున్న వరంగల్ డీఎంహెచ్ఓ వెంకటరమణ హాస్పిటల్ ని తనిఖీ చేశారు. గర్భవతికి చేసిన ఇంజక్షన్స్స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ.. శ్రీవాణికి చేసిన ఇంజక్షన్‌ను, టెస్టు రిపోర్టులను పరిశీలించామని చెప్పారు. పూర్తి విచారణ జరిపి హాస్పిటల్డాక్టర్లది తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.