ప్రధాని మోడీని కలిసిన మమతా బెనర్జీ

ప్రధాని మోడీని కలిసిన మమతా బెనర్జీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత ప్రధానిని మొదటిసారి కలుస్తున్నారు మమత. బెంగాల్ కు రావాల్సిన కేంద్ర నిధులు, ఇతర అధికారిక అంశాలపైనే మోడీతో మమత చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అంతకుముందు మమతా బెనర్జీని కలిశారు కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, ఆనంద్ శర్మ. ఎన్నికల తర్వాత మొదటిసారి మమత ఢిల్లీ వచ్చారని... అందుకే ఆమెను కలిసినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సాధించిన విజయానికి అభినందనలు తెలిపామన్నారు. ఇక రేపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు మమతా బెనర్జీ. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం, రాజకీయ కూటమిపై వీరిద్ధరి మధ్య చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అలాగే రేపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలతోనూ మమతా బెనర్జీ సమావేశం కానున్నారు.