ఎన్నికల ఫలితాలు చూసి దూకుడు వద్దు

ఎన్నికల ఫలితాలు చూసి దూకుడు వద్దు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పంజాబ్ మినహాయిస్తే..  నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కోరుకుంటే మనమందరం కలిసి పోరాడవచ్చన్నారు. కాంగ్రెస్ కోరుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోరాడదామన్నారు మమత. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఎలాంటి దూకుడు పనికిరాదన్నారు. బీ పాజిటివ్ ఉండాలన్నారు.

4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి పెద్ద నష్టమే అన్నారు మమత. 2022 ఎన్నికల ఫలితాలు 2024 ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయన్నడం ఆచరణలో సాధ్యం కాదన్నారు సీఎం మమతా బెనర్జీ. బీజేపీని ఎదుర్కోవాలనుకునే  రాజకీయ పార్టీలన్నీ కలిసి నడవాలన్నారు. కాంగ్రెస్ తమ విశ్వసనీయతను కోల్పోతోందన్నారు. , కాంగ్రెస్‌పైన ఆధారపడలేమన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా. గోవాలో పార్టీ ప్రారంభించిన మూడు నెలల్లోనే తృణమూల్ కాంగ్రెస్‌కు 6% ఓట్లు వచ్చాయన్నారు. ఇది తమకు చాలు అన్నారు మమత. 

ఇక ఎన్నికల ఫలితాలను చూస్తే... పంజాబ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో కమలం వికసించింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కమలం పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. ఉత్తర ప్రదేశ్‌లో 403 స్థానాలకుగాను బీజేపీ 256 సీట్లను దక్కించుకుంది. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లలో గెలుపొందింది. గోవా ఎన్నికల్లో బీజేపీ సగం సీట్లు సాధించింది. మొత్తం 40 సీట్లు ఉండగా బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది. 

ఇవి కూడా చదవండి:

గుజరాత్పై కన్నేసిన ఆమ్ ఆద్మీ

బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు