రిటైర్మెంట్‌‌‌‌ వెనక్కి తీసుకోను : నరైన్‌‌‌‌

రిటైర్మెంట్‌‌‌‌ వెనక్కి తీసుకోను : నరైన్‌‌‌‌

కోల్‌‌‌‌కతా : ఐపీఎల్‌‌‌‌లో దుమ్మురేపుతున్న వెస్టిండీస్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ సునీల్‌‌‌‌ నరైన్‌‌‌‌.. తన ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ రీ ఎంట్రీపై స్పందించాడు. విండీస్‌‌‌‌ తరఫున మళ్లీ బరిలోకి దిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. రీ ఎంట్రీకి ఇప్పటికే డోర్లు క్లోజ్ అయ్యాయని చెప్పాడు. ‘ఐపీఎల్‌‌‌‌లో నా పెర్ఫామెన్స్‌‌‌‌ మంచి సంతృప్తినిచ్చింది. రిటైర్మెంట్‌‌‌‌ను పక్కనబెట్టి టీ20 వరల్డ్ కప్‌‌‌‌ ఆడాలని చాలా మంది కోరుతున్నారు.

కానీ ఆ ప్రతిపాదనను నేను తిరస్కరిస్తున్నా. రిటైర్మెంట్‌‌‌‌ నిర్ణయంతో ప్రశాంతంగా ఉన్నా. తిరిగి ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడాలనే ఆలోచన లేదు. విండీస్‌‌‌‌ తరఫున మెగా ఈవెంట్‌‌‌‌ ఆడే ప్లేయర్లకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. గత కొన్ని నెలలుగా టోర్నీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న కుర్రాళ్లకు టైటిల్‌‌‌‌ గెలిచే సత్తా ఉంది. సొంత ఫ్యాన్స్‌‌‌‌ మధ్య మంచి పెర్ఫామెన్స్‌‌‌‌ చూపిస్తారని ఆశిస్తున్నా’ అని నరైన్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాలో పోస్ట్‌‌‌‌ చేశాడు.

టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ కోసం రిటైర్మెంట్‌‌‌‌ను పక్కనబెట్టాలని విండీస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ రొవ్‌‌‌‌మన్‌‌‌‌ పావెల్‌‌‌‌ గత ఏడాది కాలంగా నరైన్‌‌‌‌ను అడుగుతున్నాడు. పొలార్డ్‌‌‌‌, బ్రావో, పూరన్‌‌‌‌ కూ డా ఈ  విషయాన్ని నరైన్‌‌‌‌తో చర్చించారని పావెల్‌‌‌‌ తెలిపాడు.