ఎమ్మెల్యే కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు

ఎమ్మెల్యే కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసులో నిందితుడు పెద్దగాని ప్రసాద్ ను అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. అగస్ట్ 1న ఎమ్మెల్యేపై హత్యాయత్నం జరిగిందని..ఎయిర్ పిస్టల్, డ్రాగర్ తో వచ్చి హత్యకు యత్నించాడని తెలిపారు. అయితే ఎమ్మెల్యే కేకలు వేయడంతో నిందితుడు పారిపోయినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి..ఎయిర్ రైఫిల్, పిల్లెట్స్, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

జులై మొదటి వారంలో పరిచయమైన సుగుణ, సురేందర్ల సాయంతో ప్రసాద్ 60వేలకు కంట్రీమేడ్ గన్ కొనుగోలు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. దీనికి సంబంధించి మున్నాకుమార్ అనే వ్యక్తికి నగదు బదిలీ చేశాడని..అయితే బుల్లెట్లు మాత్రం వారు ఇవ్వలేదని తెలిపారు. ఈ కేసులో సుగుణ, సురేందర్, మున్నా కుమార్, సంతోష్ల పాత్ర ఉందని వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ప్రసాద్ పై గతంలోనే 5 కేసులు ఉన్నట్లు వివరించారు. 

అసలేం జరిగింది..?

కల్లెడ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ లావణ్య కుటుంబంతో జీవన్ రెడ్డికి రాజకీయ విభేదాలున్నాయి. లావణ్యపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఆమెను 6 నెలలు సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీనికి కారణం జీవన్‌‌‌‌‌‌‌రెడ్డి అనే అనుమానంతో ఆమె భర్త ప్రసాద్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే  జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.