తూముకుంట గ్రామంలో స్కూల్ బస్సులకు తప్పిన ప్రమాదం

తూముకుంట గ్రామంలో స్కూల్ బస్సులకు తప్పిన ప్రమాదం

అయిజ, వెలుగు: మండలంలోని తూముకుంట గ్రామంలో సోమవారం రెండు ప్రైవేట్  స్కూల్  బస్సులకు తృటిలో ప్రమాదం తప్పింది. బస్సులు ఎదురుగా వచ్చి పక్కకు ఒరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అయిజ నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఓ స్కూల్ బస్సు తూముకుంట గ్రామానికి వెళ్తుండగా, అప్పటికే విద్యార్థులను తీసుకొని ఆయిజకు వస్తున్న మరో స్కూల్  బస్సు ఎదురెదురుగా వస్తూ పక్కకు ఒరిగాయి. గ్రామస్తులు అక్కడికి చేరుకొని విద్యార్థులను కిందికి దింపి బస్సులను బయటకు తీశారు. ఇరుకైన రోడ్డులో ఇద్దరు డ్రైవర్ల తొందరపాటుతో ప్రమాదం జరిగి ఉండేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యజమానులకు ఫోన్  చేసి డ్రైవర్లపై ఫిర్యాదు చేశారు.