దివాలా పిటిషన్​ వేసిన వీవర్క్

దివాలా పిటిషన్​ వేసిన వీవర్క్

న్యూయార్క్​:  అప్పులు పెరిగిపోవడంతో ఆఫీస్ షేరింగ్ కంపెనీ వీవర్క్​ చాప్టర్ 11 దివాలా పిటిషన్​ దాఖలు చేసింది. స్టేక్​హోల్డర్లతో తాము రీస్ట్రక్చర్చింగ్​ సపోర్ట్​ ఒప్పం దం కుదుర్చుకున్నామని, దీనివల్ల కంపెనీ అప్పు భారీగా తగ్గుతుందని తెలిపింది. ఒకప్పుడు ఈ కంపెనీ వాల్యుయేషన్​ 44 బిలియన్ డాలర్ల వరకు వెళ్లింది.  ఇప్పుడు సంస్థ అప్పుల విలువ 50 బిలియన్​ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అప్పులను ఈక్విటీలుగా మార్చుకో వడానికి 90 శాతం మంది లెండర్లు ఒప్పుకున్నారని కంపెనీ సీఈఓ డేవిడ్​ టాలీ చెప్పారు.  అయితే తమ ఇండియా కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయమూ ఉండబోదని వీవర్క్​ తెలిపింది. ఇది ప్రత్యేక సంస్థ అని పేర్కొంది.