
వాషింగ్టన్: కరోనాతో పోరాటం విషయంలో తమ కృషిని ఇండియా ప్రధాని మోడీ మెచ్చుకున్నారని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘ఇండియాతోపాటు మిగిలిన పెద్ద దేశాలతో పోల్చుకుంటే మేం ఎక్కువ మందిని టెస్టులు చేశాం. కరోనా టెస్టింగ్స్‌లో యూఎస్ తర్వాతి స్థానంలో ఇండియా ఉంది. భారత్ కంటే 44 మిలియన్ టెస్టులు మేం ముందున్నాం. ఇండియాలో 1.5 బిలియన్ మంది ప్రజలు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాకు కాల్ చేసి.. మీరు టెస్టింగ్స్ విషయంలో చాలా బాగా పని చేశారని మెచ్చుకున్నారు’ అని నెవాడాలోని రెనోలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ ట్రంప్ పేర్కొన్నారు. తాము నిర్వహించిన కరోనా టెస్టింగులపై ప్రధాని మోడీ చేసిన ప్రశంసల గురించి మీడియాకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.