దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే ఏం చేశారు ?

దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే ఏం చేశారు ?
  • ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే వడ్లు కొంటామనడం దారుణం

హైదరాబాద్: కేసీఆర్ వాలకం చూస్తుంటే దొంగలు పడ్డ ఆర్నెళ్లకు.. అన్నట్లుంది అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్. యాసంగి వడ్లు కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఆయన స్పందించారు. ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా వడ్లు కొంటామని ప్రకటించడం దారుణమన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల రైతుల నుంచి మిల్లర్లు అగ్గువకే వడ్లను కొంటున్నారన్నారు. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు మధుయాష్కీ. 

కేసీఆర్ కుటుంబం రైస్ మిలర్లతో కల్సి రైతులను దోచుకున్నరు
తెలంగాణలో మిల్లర్లు, దళారులు రైతుల కళ్లాల వద్ద అగ్గువకు సగ్గువకు ధాన్యాన్ని కొంటున్నారని.. తీరిగ్గా ఇప్పుడు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ యాసంగి పంట కొంటాం, గింజ కూడా మిగల్చకుండా తీసుకుంటాం అని నిమ్మలంగా నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది, విజిలెన్స్ విభాగం ఏం చేస్తోంది.? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం రైస్ మిలర్లతో కల్సి రైతులను దోచుకుంటున్నరు అని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మన పొరుగు రాష్ట్రం ఛత్తీస్ గఢ్ లో కనీస మద్దతు ధర ప్రకటించి ధాన్యం కొంటోందన్నారు. 
రైతు ఆత్మహత్యకు బాధ్యుడిగా కేసీఆర్ పై హత్య కేసు నమోదు  చేయాలి
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలో అశోక్ అనే రైతు చావుకు కేసీఆర్ కారణమని.. కేసీఆర్ పై హత్య కేసు పెట్టాలని మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు అదనంగా 3 లేదా 4 వందలు చెల్లిచి ధాన్యం కొనాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. దళారులు, రైస్ మిలర్ల దోపిడీ పై యంత్రాంగం నిఘా పెట్టాలని ఆయన కోరారు. గతంలో జిల్లా కలెక్టర్లతో వరి మేయొద్దని రైతులను బెదిరించారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని బెదిరిచడంతో రైతులు ఆగమాగం అయ్యారని.. ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు కొంటాం అంటోంది, మరి రైతుల ఖాతాలో డబ్బు జమ అయ్యదెప్పుడు? అని మధుయాష్కీ గౌడ్ ప్రశ్నించారు. కల్వకుంట్ల  కుటుంబ సభ్యులు 111జీవోతో భూములు కాజేశారని, రైతుల భూములను అగ్గువకు సగ్గువకు కొనుకోళ్లు చేశారని ఆయన ఆరోపించారు. 

 

ఇవి కూడా చదవండి

కర్ణాటకలో కలకలం రేపిన కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతి

వడ్లను మేమే కొంటం

జ‌ల‌మండ‌లి మేనేజ‌ర్‌, వ‌ర్క్ ఇన్‌స్టెక్ట‌ర్‌ స‌స్పెండ్

అప్పులు కట్టలేం.. చేతులెత్తేసిన ప్రభుత్వం

చైనాలోని 23 నగరాల్లో లాక్డౌన్..కఠిన ఆంక్షలు