30 – సిటీ పోలీస్ యాక్ట్ ఏం చెప్తోంది?

30 – సిటీ పోలీస్ యాక్ట్ ఏం చెప్తోంది?

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ‘30 – సిటీ పోలీస్ యాక్ట్’ ను అమలు చేస్తూ  నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పోలీసు ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని సీపీ స్పష్టం చేశారు. ఇంతకీ ‘30 – సిటీ పోలీస్ యాక్ట్’ అంటే ఏమిటి?

1861 పోలీస్ యాక్ట్లోని సెక్షన్ 30 ప్రకారం నగరంలో పోలీసులు ఆంక్షలు విధించవచ్చు. ఈ సెక్షన్ అమల్లో ఉన్న సమయంలో శాంతిభద్రతలను పరిగణలోకి తీసుకుని బహిరంగ సభలు. ర్యాలీలకు అనుమతి ఇచ్చే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇందులో భాగంగా  పోలీసు ఉన్నతాధికారులు తమ పరిధిలోని కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా కట్టడి చేయవచ్చు. ఆ కార్యక్రమాలు ఏయే ప్రాంతాల వరకు పరిమితం కావాలన్న దానిపైనా రూట్ మ్యాప్ విడుదల చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. 

సభలు, సమావేశాలు, ర్యాలీల  వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన సందర్భాల్లోనే సెక్షన్ 30ని పోలీసులు ప్రయోగిస్తారు.  నిషేధాజ్ఞలున్న ప్రాంతాల్లో డీజే సౌండ్స్ తో ఊరేగింపులపైనా బ్యాన్ ఉంటుంది. వీటిని ఉల్లంఘించే వారిపై మెట్రోపాలిటన్ సిటీ పోలీస్ యాక్ట్ లోని 2016 ఐపీసీ 188, యూ/ఎస్76 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారు.