ఐటీ న‌యా ట్రెండ్.. సోమ‌వారం టెన్ష‌న్ నుంచి రిలీఫ్ ఎలా.. ఓ సీఈవో కొత్త ఐడియా

ఐటీ న‌యా ట్రెండ్.. సోమ‌వారం టెన్ష‌న్ నుంచి రిలీఫ్ ఎలా.. ఓ సీఈవో కొత్త ఐడియా

కరోనా మహమ్మారి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది పని చేసే విధానంపైనా భారీ ప్రభావాన్ని చూపింది. కరోనా తర్వాత ఉదయం 9నుంచి సాయంత్రం 5వరకు ఆఫీస్ లో ఉండి పనిచేయాలనే ఆలోచన మారింది. వారానికి 4 రోజులు పని వేళలు, సౌకర్యవంతమైన పని గంటలు.. ఇలా చాలా కంపెనీలు ట్రెండ్ ను సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు కూడా ఈ మార్పును స్వీకరించాయి, అమలు చేశాయి కూడా. అంతే కాదు ఈ తరహా మార్పులపై ఉద్యోగులు కూడా సంతృప్తిగా ఉన్నారు. కంపెనీలు కూడా లాభాలు అందిపుచ్చుకుంటున్నాయి.

ప్రస్తుతం బేర్ మినిమమ్ మండేస్ అనే కాన్సెప్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ 'బేర్ మినిమమ్ మండేస్' అంటే ఏంటీ అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

'బేర్ మినిమమ్ మండేస్' అనేది వారాంతం తర్వాత తలెత్తే ఒత్తిళ్లు, అంచనాలను తగ్గించే, పనిని సులభం చేసేందుకు ఎంకరేజ్ చేసే పద్దతి. ఈ పద్దతి ప్రకారం సోమవారాల్లో ఇంటి నుండి పని చేయడం లేదా సగం రోజు మాత్రమే పని చేయడం. ఇందులో ఉద్యోగి ఏది కావాలనుకుంటే అది చేయవచ్చు. ఇది కేవలం సోమవారం పనిలోకి రావడానికి ఉద్యోగికి తక్కువ ఒత్తిడిని కలిగించడానికి దీన్ని రూపొందించారు.

ఈ ట్రెండ్‌ను ఎవరు ప్రారంభించారు?

ఈ కొత్త వర్క్ ట్రెండ్‌ను ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు చెందిన 31 ఏళ్ల మార్కెటింగ్ మేనేజర్ కైట్లిన్ వింటర్ ప్రారంభించారు. తన సిబ్బందికి "బేర్ మినిమమ్ మండేస్"ను పరిచయం చేసి వైరల్ గా మారారు. కాన్సెప్ట్‌ను రూపొందించిన మారిసా జో ఈ అంశంపై స్ఫూర్తిదాయకమైన కథనాన్ని చదివిన తర్వాత తనకు ఈ ఆలోచన వచ్చిందని కైట్లిన్ చెప్పారు.