కాలుష్య నియంత్రణకు ఏం చేస్తున్నారో చెప్పాలె

కాలుష్య నియంత్రణకు ఏం చేస్తున్నారో చెప్పాలె

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయుకాలుష్యంపై విచారణను నవంబర్ 29కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరో రెండు, మూడు రోజుల పాటు పొల్యూషన్ కంట్రోల్ కోసం నిబంధనలను కొనసాగించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. పొల్యూషన్ లెవల్ 100 వరకు వస్తే రూల్స్ ను సడలించవచ్చని సూచించింది. కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ల ధర్మాసనం ప్రశ్నించింది. వాయు కాలుష్యం తగ్గినా ఈ కేసును మాత్రం ఇప్పట్లో కేసును ముగించేది లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

రైతులు పంటవ్యర్థాలను కాల్చడం వాయు కాలుష్యానికి కారణంగా చెబుతున్న నేపథ్యంలో దీనికి శాశ్వత పరిష్కారాన్ని ఎందుకు కనుగొనడం లేదని కేంద్రంతోపాటు ఢిల్లీ సర్కార్ ను సుప్రీం క్వశ్చన్ చేసింది. అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారని ధర్మాసనం సీరియస్ అయ్యింది. రైతులను నేరుగా కలవడంతోపాటు సైంటిస్టుల సూచనలతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని పేర్కొంది. కాలుష్య నియంత్రణకు సంబంధించి సైంటిఫిక్ మోడల్ డేటాను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా, ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను మరో మూడ్రోజుల పాటు రివ్యూ చేస్తామని ఈ కేసులో కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా చెప్పారు. కాలుష్య నియంత్రణకు దీర్ఘకాలిక వ్యూహాలను అమలుపై దృష్టి పెట్టామన్నారు. ఇకపోతే, పంజాబ్‌లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పంటవ్యర్థాలు దహనం చేసే రైతులకు జరిమానాలు విధించడం లేదని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వెల్లడించారు. 

మరిన్ని వార్తల కోసం:

ఆ రెండు పార్టీలవి మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా

వైసీపీ నేతలకు ఓణీల ఫంక్షన్

దోచుకున్నోళ్లు ఏసీ రూముల్లో.. నిర్వాసితులు నాసిరకం ఇండ్లలో..