దోచుకున్నోళ్లు ఏసీ రూముల్లో.. నిర్వాసితులు నాసిరకం ఇండ్లలో..

దోచుకున్నోళ్లు ఏసీ రూముల్లో.. నిర్వాసితులు నాసిరకం ఇండ్లలో..
  • బీఏస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్​

దుబ్బాక, వెలుగు: పాడి పంటలతో సుభిక్షంగా బతికిన మల్లన్నసాగర్​ నిర్వాసితులు నేడు చెట్టుకొకరు, పుట్టకొకరుగా  దుర్భరంగా బతుకీడుస్తున్నారని బీఏస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్​ప్రవీణ్ కుమార్​అన్నారు. బలవంతంగా వ్యవసాయ భూములను గుంజుకున్న కేసీఆర్ ప్రభుత్వం నిర్వాసితులకు నాసిరకం ఇళ్లను నిర్మించి చేతులు దులుపుకొందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంగళవారం నిర్వహించిన బహుజన రాజ్యాధికార ప్రతిజ్ఞ సభలో ఆయన మాట్లాడారు. మల్లన్నసాగర్​ ప్రాజెక్టు పేరుతో దోచుకున్నోళ్లంతా ఏసీ రూముల్లో ఉంటే నిర్వాసితులకు మాత్రం నాసిరకం ఇండ్లు దిక్కయ్యాయన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ కుటుంబపాలనకు చరమగీతం పాడాలని ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలకు డబుల్ ​బెడ్​రూం ఇండ్లు ఇస్తానని మోసం చేసిన టీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసే కుట్రలో కేసీఆర్​ ఉన్నారని, అందుకే జనాభాలో 85 శాతం ఉన్న బహుజనులను బానిసలుగా చేయడానికి బర్లు, గొర్లు, దళితబంధు పథకాలతో మభ్య పెడుతున్నారని ఆరోపించారు. నీలి కండువాలతో అసెంబ్లీకి పోతే ప్రజా దోపిడీనంతా బయటకు తీయొచ్చని పేర్కొన్నారు. కేసీఆర్​ పాలనలో అగ్రవర్ణాలు సంపన్నులైతే అణగారిన వర్గాలను మాత్రం చర్లపల్లి జైలులో పెట్టి రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారు. దుబ్బాక గడ్డకు గొప్ప చరిత్ర ఉందని, రాబోయే ఎన్నికల్లో చరిత్రను తిరగరాయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం:

వైసీపీ నేతలకు ఓణీల ఫంక్షన్

వానాకాలం బియ్యం ఎక్కువ కొంటం

కంప్యూటర్ కొనలేం.. ల్యాప్​టాప్ ​పట్టుకోలేం