కోడింగ్‌‌‌‌ కోసం కొత్త కోడెక్స్‌‌‌‌.. ఇక కోడింగ్ వెరీ ఈజీ...!

కోడింగ్‌‌‌‌ కోసం కొత్త కోడెక్స్‌‌‌‌.. ఇక కోడింగ్ వెరీ ఈజీ...!

ఏఐ వల్ల ఇప్పటికే ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్లు ఏఐ రాకతో కోడింగ్‌‌‌‌ లాంటి వాటిని గతంతో పోలిస్తే చాలా సులభంగా చేయగలుగుతున్నారు. కంపెనీలు తక్కువ వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌తో ఎక్కువ పని చేయించుకుంటున్నాయి. అయితే.. ఇప్పుడు కోడింగ్‌‌‌‌ని మరింత సులభతరం చేసేందుకు చాట్‌‌‌‌ జీపీటీ కొత్త కోడెక్స్‌‌‌‌ వెర్షన్‌‌‌‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ఇది ప్రాజెక్టులను తయారుచేయడానికి, ఫీచర్లు, టెస్ట్‌‌‌‌లను యాడ్‌‌‌‌ చేసేందుకు, కోడ్‌‌‌‌ను డీబగ్ చేయడానికి, కోడ్ ఇంటర్నల్‌‌‌‌ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ని మెరుగుపరచడానికి (కోడ్ రీఫ్యాక్టరింగ్) శిక్షణ పొందింది. దాని కోడ్ రివ్యూ కెపాసిటీతో షిప్పింగ్‌‌‌‌కు ముందే క్లిష్టమైన బగ్స్‌‌‌‌ని గుర్తించగలదు. అంతేకాదు.. ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. పైగా తెలివైనది.