
డిపాజిట్ గల్లంతు.. ఈ మాట ఎన్నికల సమయంలో ఎక్కువగా వినబడుతుంది. అయితే అసలు ఈ డిపాజిట్ అంటే ఏంటి? డిపాజిట్ దక్కించుకోవడానికి.. కోల్పోవడానికి తేడాలేంటి? దీనికి సరైన అర్థం చాలా మందికి తెలియదు. దానికి సంబంధించిన సరైన అర్థం ఏంటి, ఎన్నికల సమయంలో ఎందుకు ఈ మాటను ఎక్కువగా మాట్లాడుతారో తెలుసుకుందామా..
ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అభ్యర్థి నామినేషన్ వేయాలంటే.. ఎన్నికల సంఘానికి కొన్ని డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సరైన అర్థం ఏంటంటే.. ధరావతు అని.. ఇంగ్లీష్ లో అయితే డిపాజిట్ అని అంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థులు రూ.10 వేలు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
డిపాజిట్ దక్కాలంటే.. ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ఓట్ల లెక్కింపు జరిగిన అనంతరం.. ఆయా అభ్యర్థుల నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లలో.. 1/6వ వంతుకు మించి ఓట్లు పడిన వారికి డిపాజిట్ ని తిరిగి ఇస్తారు. అంతకంటే తక్కువ పడితే.. ఆ డిపాజిట్ ను ప్రభుత్వమే జప్తు చేసుకుంటుంది.