అజ్ఞాని, అహంకారికి వ్యాక్సిన్ అవసరమా?

అజ్ఞాని, అహంకారికి వ్యాక్సిన్ అవసరమా?

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర సర్కార్‌పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. జూలై వచ్చినప్పటికీ టీకాలు అందుబాటులో లేవంటూ రాహుల్ కామెంట్ చేశారు. దీంతో రాహుల్‌పై కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్షవర్దన్ ఫైర్ అయ్యారు. ఈ నెలలో రాష్ట్రాలకు 12 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని పీయూష్ అన్నారు. వ్యాక్సిన్ల సరఫరా గురించి రాష్ట్రాలకు 15 రోజుల కిందే సమాచారం ఇచ్చామన్నారు. కరోనాపై రాజకీయం చేయడం రాహుల్ గాంధీ మానుకోవాలని హితవు పలికారు. 

రాహుల్ ట్వీట్‌‌కు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా కౌంటర్ ఇచ్చారు. వ్యాక్సిన్ల లభ్యతపై గురువారమే క్లారిటీ ఇచ్చానన్నారు హర్షవర్దన్. రాహుల్ సమస్య ఏంటని ప్రశ్నించారు. అజ్ఞానం, అహంకారం ఉన్న వారికి ఎలాంటి వ్యాక్సిన్ లేదంటూ రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ నాయకత్వంపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.