చీర క్యాన్సర్ అంటే ఏంటి.? ఎలా వస్తుంది

చీర క్యాన్సర్ అంటే ఏంటి.? ఎలా వస్తుంది

ప్రపంచలోని భయంకరమైన మహమ్మారిలలో క్యాన్సర్ ఒక్కటి. క్యాన్సర్ లలో చాలా రకాలు ఉన్నాయి. బ్రెస్ట్, లంగ్స్, స్కిన్ ,త్రోట్, గర్భాశయం ,అండాశంయ, జీర్ణాశయం,పేగులు,నోటి  క్యాన్సర్ ఇలా చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి. క్యాన్సర్  వచ్చిందంటే చాలు కోలుకోవడం కష్టం. దీని నుంచి కోలుకోవాలంటే చాలా కాలం పడుతుంది.  అయితే లేటెస్ట్ గా మన దేశంలో చీర క్యాన్సర్  మహిళలను కలవరపెడుతోంది. చీర క్యాన్సర్ ఎలా వస్తుంది..ఎందుకు వస్తుందో  తెలుసుకుందాం.

భారత దేశంలోని స్త్రీలు  ఎక్కువగా ధరించే వాటిలో  ముఖ్యమైనది చీర. అయితే ఈ  చీర కట్టుకునే విధానం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని గుర్తించారు. బీహార్, జార్ఖండ్ లలో  చీర క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.  ఇండియాలోని మహిళల్లో కనిపించే క్యాన్సర్లలో చీర క్యాన్సర్ ఒక శాతం. దీనిని  వైద్య భాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా (SSC)  అంటారు.

ముంబైలోని ఆర్ఎన్ కూపర్ ఆస్పత్రిలో దీనిపై పరిశోధనలు కూడా చేశారు. 68 ఏళ్ల మహిళకు  క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన బాంబే హాస్పిటల్ వైద్యులు చీర క్యాన్సర్ అని పేరు పెట్టారు. ఆ మహిళ 13 ఏళ్ల నుంచి చీర కట్టుకున్నట్లు గుర్తించారు.

చాలా మంది  స్త్రీలు చీరలు ధరిస్తారు.  చీర కట్టుకోవడానికి పెట్టీకోట్ ను నడుముకు కాటన్ దారంతో గట్టిగా కట్టుకుంటారు.   అయితే మహిళలు ఎక్కువ సేపు ఒకే వస్త్రాన్ని  ధరించినప్పుడు  అది నడుముపై రుద్దినట్టు అవుతుంది.  అక్కడ చర్మం  దెబ్బతిని   క్యాన్సర్ కు కారణం అవుతుందని  ఉందని ఢిల్లీలోని పీఎస్ఆర్ఐ ఆస్పత్రి  క్యాన్సర్ సర్జన్ డాక్టర్ వివేక్ గుప్తా తెలిపారు. 

కంగ్రీ క్యాన్సర్ అంటే ఏమిటి?

అదేవిధంగా కాశ్మీర్‌లో కంగ్రీ క్యాన్సర్ ను గుర్తించారు. ఇది చర్మ క్యాన్సర్ కూడా. కశ్మీర్ లో  విపరీతమైన చలి ఉన్నప్పుడు అక్కడి ప్రజలు పొయ్యి వంటి మట్టి కుండలో కూర్చొని  మంటకాగుతారు. దీని నుంచి వారు వెచ్చదనం పొందుతారు. కానీ కడుపు.. తొడలకి వచ్చే వేడి క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

అదే విధంగా  చాలా టైట్ ఫిట్ జీన్స్ పురుషులలో క్యాన్సర్‌కు కారణమని భావించారు.  చాలా  టైట్ గా ఉండే బట్టలు గంటల తరబడి ధరిస్తే అవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఆ ప్రాంతంలో ఆక్సిజన్ ప్రవాహానికి ఆటంకం ఏర్పడవచ్చు. పరిశోధన ప్రకారం  జీన్స్  మగవారిలో పొత్తికడుపు దిగువ భాగంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది.  ఇది స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది.  ఆడవారిలో వృషణ క్యాన్సర్ (అండాశయ క్యాన్సర్) కు కూడా దారితీస్తుంది. అయితే  దీనిపై పరిశోధనలో  ఇంకా రుజువు కాలేదు

ఎవరైనా టైట్ గా  ఉండే డ్రెస్సులను నిరంతరం ధరించినట్లయితే  జాగ్రత్తగా ఉండాలి. లో దుస్తులు, ఇన్నర్‌వేర్ లాంటివి  చాలా టైట్‌గా ఉంటే  ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. జిమ్ కోసం ధరించే టైట్ బట్టలు కూడా సమస్యలను కలిగిస్తాయి.  అయితే ఆ డ్రెస్సులు నిర్దిష్ట సమయం  ధరించడం వల్ల  అవి తక్కువ సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి టైట్ డ్రెస్సులు వేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.