ఆ 110 కోట్లు ఏమైనట్టు ?

ఆ 110 కోట్లు ఏమైనట్టు ?

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ స్కామ్‌‌‌‌లో ఈడీ, ఐటీ ఎంక్వైరీ

మనీ ల్యాండరింగ్‌‌‌‌, బ్యాంక్ అకౌంట్లపై ఫోకస్

హెచ్ఎస్‌‌ ‌‌బీ సీకి నోటీసులు

పేటీఎం ప్రతినిధుల ఎంక్వైరీ

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైమ్‌‌‌‌లోనే రూ.646 కోట్లు!

నిందితులను 7 రోజుల కస్టడీ కోరిన సీసీఎస్‌‌‌‌ పోలీసులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చైన్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ స్కామ్‌‌‌‌పై ఎన్‌‌‌ఫో ర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ), ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌(ఐటీ) దర్యాప్తు ప్రారంభించాయి. సిటీ సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్ పోలీసులు అందించిన వివరాల ఆధారంగా చైనా కంపెనీల మనీ ల్యాండరింగ్‌‌‌‌పై ఫోకస్‌‌‌‌ పెట్టాయి. ఐటీ ఆఫీసర్లు బుధవారం సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్ పోలీసుల నుంచి కేసు డాక్యుమెంట్లు సేకరించారు. సీసీఎస్‌‌‌‌ నోటీసులతో హాజరైన పేటీఎం ప్రతినిధులను విచారించారు. ఢిల్లీ కేంద్రంగా రిజిస్టరైన 32 కంపెనీల గేమింగ్‌‌‌‌ అకౌంట్ల సమాచారాన్ని సేకరించారు. అలాగే ఓవర్‌‌‌‌సీస్‌‌‌‌ అకౌంట్లలోకి ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయిన 110 కోట్లు ఎవరికి, ఎక్కడి కి వెళ్లాయనే దానిపై ఈడీ దృష్టిపెట్టిం ది. అట్లనే హైదరాబాద్‌ నుంచి ఆపరేట్‌‌‌‌ అయిన బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్‌‌‌‌ అయిన డబ్బు తో ఆ తర్వాత జరిగిన ట్రాన్సా క్షన్ల వివరాలు ఇవ్వాలంటూ హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీ బ్యాంకుకు నోటీసులు ఇచ్చారు.

రెండు పేటీఎం అకౌంట్ల నుంచే డబ్బు డిపాజిట్

గుర్గావ్‌‌‌‌లోని హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీలో ఏడాదిగా రెండు పేటీఎం అకౌంట్స్‌‌‌‌ నుంచే గేమింగ్‌‌‌‌ నగదు డిపాజిట్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆన్‌‌‌‌లైన్ గేమింగ్‌‌‌‌ ద్వారా కిందటేడాది చైనాకు చెందిన ‘‘బీజింగ్‌‌‌‌ టుమారో’’ కంపెనీలో రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు టర్నోవర్‌‌‌‌ జరిగింది. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైమ్‌‌‌‌లో ‘‘కలర్‌‌‌‌‌‌‌‌ ప్రిడిక్షన్‌‌‌‌” పేరుతో ఇండియాలో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. నాలుగు నెలల్లో దేశ వ్యాప్తంగా రూ.646 కోట్లు గుర్గావ్‌‌‌‌ హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌బీసీలో డిపా జిట్‌‌‌‌ అయినట్లు సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్ పోలీసులు ఆధారాలు సేకరించారు.

మనీ ల్యాండరింగ్‌‌‌‌పై ఈడీ దర్యాప్తు

జనవరి నుంచి లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేసి మొత్తం రూ.1,106 కోట్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌లో వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. లింక్యూన్‌‌‌‌, డొకిపే, స్పాట్‌‌‌‌పే, గేట్‌‌‌‌వేస్‌‌‌‌తోనే ఎక్కువ డిపాజిట్లు అయినట్లు విచారణలో తేలింది. బీజింగ్‌‌‌‌ టుమారో కంపెనీకి చెందిన సౌత్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌ ఆసియా అధికారి యాన్‌‌‌‌ యూను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సీసీఎస్‌‌‌‌ పోలీసులు కోర్టులో పిటిషన్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేశారు. నలుగురు నిందితులను ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ప్రధాన నిందితుడు యాన్‌‌‌‌యూ తోపాటు ధీరజ్‌ సర్కార్‌‌‌‌, అంకిత్‌‌‌‌ కపూర్‌‌‌‌, నీరజ్‌ తులిలను విచారించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. దీంతో ఆన్‌‌‌లైన్‌‌‌‌ గేమింగ్‌‌‌‌ స్కామ్‌‌‌‌లో ఓవర్‌‌‌‌‌‌‌‌సిస్‌‌‌‌ అకౌంట్లలో డిపాజిట్‌‌‌‌ అయిన రూ.110 కోట్లకు సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి.