NTR Watch Price: షాక్ ఇస్తున్న తారక్ వాచ్ ధర.. రూ.5 కోట్ల లోపు ఓ సినిమా తీయొచ్చు..

NTR Watch Price: షాక్ ఇస్తున్న తారక్ వాచ్ ధర.. రూ.5 కోట్ల లోపు ఓ సినిమా తీయొచ్చు..

వార్-2 ప్రమోషన్లలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్గా నిలిచాడు. ఆయన ఎమోషన్స్పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ క్రమంలో అందరి కళ్లూ ఆయన వాచ్ మీదే పడ్డాయట. ఆ వివరాల్లోకి వెళితే.. 

వార్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ ధరించిన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్కు వాచ్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఆ విషయాన్ని స్వయంగా ఆయన పలు సందర్భాల్లోనూ చెప్పారు.

ఇపుడు వార్ 2 ఈవెంట్కు కూడా తారక్ ఓ ఖరీదైన వాచ్ ధరించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. ఇక ఈ వాచ్ బ్రాండ్తో పాటు దాని ధర ఎంతనేది ఆయన ఫ్యాన్స్ గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చివరికి ఎన్టీఆర్ వాచ్ వివరాలు బయటకొచ్చాయి.

ఎన్టీఆర్ ధరించిన ఆ వాచ్ 'అడిమార్స్ పిగుట రాయల్' బ్రాండ్కి చెందినదని కనిపెట్టారు. ఈ వాచ్ ధర అక్షరాలా మూడు కోట్ల నలభై ఐదు లక్షల డెబ్బై ఏడువేల ఎనిమిదివందల ఒక్క రూపాయి (రూ.3.45 కోట్లు). ఈ ఖరీదుతో ఒక చిన్న సినిమా కూడా తీయచ్చని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 

గతంలో నందమూరి సుహాసిని తనయుడు హర్ష వివాహానికి ఎన్టీఆర్ హాజరయ్యారు. ఆ ఫంక్షన్ లో క్యాజువల్ అండ్ సింపుల్ గా ఉన్న వాచ్ పెట్టుకున్నారు. దీని ఖరీదు రూ. 2.45 కోట్లకు పైనే ఉంటుంది. అలాగే, RRR ప్రమోషన్స్ లో పాటక్ ఫిలిప్ వాచ్ పెట్టుకొని కనిపించాడు. దాని ధర కూడా రూ.1 కోటి 56 లక్షల పైనే ఉంటుంది.

ఇకపోతే.. ఇండియాలో ఉన్న స్టార్ యాక్టర్స్ లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన ఒక్కో సినిమాకు దాదాపు రూ.60 నుండి రూ.70 కోట్ల వరకు రెమ్యునరేషన్గా తీసుకుంటారు. ఇక ఆయన వాడే కార్లు, జడ్జెట్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి. వాటి కోసం కోట్లలో ఖర్చు చేస్తారు ఎన్టీఆర్.