Skin care: చర్మం పొడిబారకుండా.. తల తల మెరవాలంటే ఇలా చేయండి

Skin care: చర్మం పొడిబారకుండా.. తల తల మెరవాలంటే ఇలా చేయండి

చలికి చర్మం తొందరగా డ్రై అవుతుంది. పగులుతుంది కూడా. మాయిశ్చరైజర్ రాసినా కొన్ని ఉండదు. అలాంటప్పుడు స్కిన్ కేర్ రొటీన్ మార్చాలి. సీజనల్ స్పెసిఫిక్ స్కిన్ కేర్ పాటించాలి. వంటింట్లో దొరికే పదార్థాలతో మాయిశ్చరైజర్ తయారు చేసుకోవాలి. అదెలాగంటే...

కావాల్సినవి..

  • నెయ్యి,
  • నీళ్లు.
  • ఎసెన్షియల్ ఆయిల్. 

తయారీ..

ఒక గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. అందులో కొన్ని చన్నీళ్లుపోసి, బాగా కలపాలి. చిన్నచిన్న ముద్దలుగా ఉండే నెయ్యిమెత్తగా అయ్యే వరకు నీళ్లు పోస్తూ కలపాలి. ఎక్కువైన నీళ్లని తీసేసి, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే హోమ్ మేడ్
మాయిశ్చరైజర్ రెడీ. దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసి, ఫ్రిజ్లో పెట్టాలి.

లాభాలివి..

స్నానం చేసిన తర్వాత ఈ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నెయ్యి, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్న ఈ మాయిశ్చరైజర్ పొడి చర్మానికి మందులా పనిచేస్తుంది. అంతేకాదు ఎండవల్ల వచ్చిన మచ్చలు తగ్గిపోతాయి. నెయ్యిలోని ఒమెగా- 3. ఒమెగా -9 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-ఎ, ఇ.కె వంటివి చర్మాన్ని హెల్దీగా ఉంచుతాయి.