విపత్తులను ఎలా తట్టుకోవాలి.. ఆ సమయంలో ఏం చేయాలి..

విపత్తులను ఎలా తట్టుకోవాలి.. ఆ సమయంలో ఏం చేయాలి..

బార్డర్‌‌లో పరిస్థితులు రోజురోజుకూ మారిపోతున్నాయి. పాకిస్తాన్​ మన ఆర్మీ క్యాంపులతోపాటు సామాన్య పౌరుల మీద కూడా దాడులు చేసింది. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు వచ్చాయి. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అసలు మనం ఏం చేయాలి? ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి. ఏం జరిగినా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అలాంటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల గురించి ముందుగానే అందరూ తెలుసుకోవాలి. కాకపోతే.. ఏదో జరిగిపోతుందని ముందే కంగారుపడొద్దు. ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేసే వరకు మనం సేఫ్​గా ఉన్నట్టే. 

షెల్టర్​ : విపత్తులు సంభవించినప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. కాబట్టి దగ్గర్లోని మంచి షెల్టర్​లోకి వెళ్లిపోవాలి. గందరగోళంలో సహజంగా ప్రతి ఒక్కరూ పరిగెత్తుతుంటారు. కానీ..  అది చాలా ప్రమాదకరం. ముందుగా దగ్గర్లో మిమ్మల్ని పూర్తిగా కవర్​ చేయగలిగే గట్టి ఫర్నిచర్ (టేబుల్, డెస్క్), షెల్ఫ్​ లాంటిది ఉంటే దాని కింద దాక్కోవాలి. గోడలకు దూరంగా ఉండాలి. 

ప్రభుత్వ సూచనలు పాటించాలి : సోషల్​ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దు. విశ్వసనీయ సంస్థల నుంచి వచ్చే వార్తలనే నమ్మాలి. ఏదైనా నమ్మలేని విషయం ప్రచారంలోకి రాగానే ముందుగా ఫ్యాక్ట్‌ చెక్​ చేసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ సూచనలు మాత్రమే పాటించాలి. దేశ భద్రత లాంటి విషయాల్లో ప్రభుత్వానికి సహకరించాలి. మన రహస్యాలను, అనవసరమైన వాటిని సోషల్​ మీడియోలో
పోస్ట్‌ చేయకూడదు. 

►ALSO READ | ఒక్క సెల్ఫీతో మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు .!

పిల్లలు, వృద్ధులు: విపత్కర పరిస్థితులు ఎదురైతే ముందుగా ఎఫెక్ట్‌ అయ్యేది పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు. కాబట్టి అలాంటివాళ్లనే ముందుగా సేఫ్​ ప్లేస్​లకు పంపించాలి. వాళ్లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేయాలి. ముఖ్యంగా ఉద్రిక్తతలు ఉన్నప్పుడు  తరచూ ప్రయాణాలు చేయడం అంత సేఫ్​ కాదు. ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. కాబట్టి ఇంట్లోనే ఉండటం మంచిది.

కమ్యూనికేషన్​: విపత్కర పరిస్థితుల్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కాబట్టి ఫోన్​ ఎప్పుడూ ఆన్​లోనే ఉండేలా చూసుకోవాలి. అత్యవసర సమయాల్లో బ్యాటరీ బ్యాకప్​ కోసం పవర్​ బ్యాంక్​లు లాంటివి వాడాలి. ఇలాంటి టైంలో కరెంట్ కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి టార్చ్​లైట్​, కొవ్వొత్తులు సిద్ధంగా పెట్టుకోవాలి. మనోధైర్యం కోల్పోవద్దు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన తగ్గించుకోవాలి. దేనికైనా సిద్ధంగా ఉండాలి. 

ఫుడ్​ స్టోరేజీ, ఫస్ట్‌‌‌‌ ఎయిడ్​: ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొంత ఫుడ్​ని దాచుకోవాలి. ఇది అత్యవసర సమయాల్లో అవసరమవుతుంది. బేసిక్​ మెడిసిన్​తోపాటు ఫస్ట్‌ ఎయిడ్​ కిట్, కొన్ని నిత్యవసర వస్తువులను అందుబాటులో పెట్టుకోవాలి. కొంతకాలం బయటకు వెళ్లకపోయినా ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్​ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ వైద్య సాయం దొరకడం కష్టం. అందుకే ​ ఫస్ట్‌ ఎయిడ్​ చేయడం తెలుసుకోవాలి. అంటే  రక్తస్రావం ఆపడం, కాలిన గాయాలకు చికిత్స చేయడం, ఎముకలు విరిగినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స గురించి తెలుసుకోవాలి.