పిల్లలకేంటి స్వేచ్ఛ ఇచ్చేది? పెద్దలు చెప్పినట్లు వినాలి. అంతేగాని వాళ్లకేం తెలుసు? అనేది తల్లిదండ్రుల మాట. కానీ పిల్లలకూ అభిరుచులు. అభిప్రాయాలు ఉంటాయి. వాళ్లు చెప్పే మాటలు వినాలి. వాళ్లకు ఏం ఇష్టమో తెలుసుకోవాలి. అవసరం అయితే వాళ్లు చెప్పినట్లు నడుచుకో నివ్వాలి. వాళ్లపై అమ్మానాన్నలు అభిప్రాయాలు రుద్దకుండా సొంతంగా ఎదిగేందుకు ప్రోత్సహించాలి.
ఇంటి పక్కనున్న పిల్లలతో స్వేచ్ఛగా ఆడుకో నివ్వాలి. అప్పుడప్పుడు వాళ్ల స్నేహి తులను పిలిచి ఇంట్లోనే చిన్న చిన్న పార్టీలు ఏర్పాటు చేస్తుండాలి. పిల్లలు జట్లుగా ఏర్పడి ఆడుకోవటం వల్ల గెలుపు, ఓటముల గురించి తెలుస్తుంది.
జీవితంలో గెలుపు గురించే కాదు, ఓటమి గురించి నేర్చుకుంటారు.అప్పుడే పెద్దయిన తర్వాత ఎదురయ్యే సమస్యలను పాజిటివ్ గా తీసుకోగ లుగుతారు. అలాగే ఇతరులతో ఇచ్చి పుచ్చుకునే పద్ధతి అలవాటుచేయాలి.
స్కూల్లో లంచ్ షేర్ చేసుకోవటం, తోటి పిల్లలకు అవసరం అయితే సహాయం చేయడం లాంటి నుంచి అలవాట్లు నేర్పించాలి. ఒంటరిగా కాకుండా తన క్లాసు పిల్లలతో కలిసి చదువుకోమని చెప్పాలి. ఇలాంటి వాటివల్ల సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పర చుకుంటారు పిల్లలు. అలాగే ప్రతిదానికీ అమ్మనాన్నలపై ఆధారపడటం మానేసి సొంత నిర్ణయాలు తీసుకోగ లుగుతారు.
ఇప్పోస్ మోరీ అనే పరిశో ధకుడు ఒకవెయ్యి పన్నెండు మంది. పిల్లలపై అధ్యయనం చేసి నేటితరం పిల్లలు ప్రకృతికి దూరంగా బతుకు తున్నారని చెప్పాడు. కాబట్టి పిల్లలను అప్పుడప్పుడు పార్కులకు, విహార యాత్రలకు తీసుకెళ్తూ ఉండాలి.
