మరో చరిత్రాత్మక ఘట్టానికి నాసా శ్రీకారం

మరో చరిత్రాత్మక ఘట్టానికి నాసా శ్రీకారం

మరో చరిత్రాత్మక ఘట్టానికి నాసా శ్రీకారం చుట్టింది. 50 ఏళ్ల తర్వాత చంద్రడి పైకి మనిషిని పంపే ప్రయోగానికి సిద్ధమైంది.  ఆర్టెమిస్ -1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా రాకెట్లు, వ్యోమ నౌకలు పంపనుంది. చందమామను చుట్టి వచ్చే ఈ స్పేస్ షిప్ లో వ్యోమగాములు ఉండరు. తర్వాత జరిగే ప్రయోగాలు మాత్రం మానవ సహితంగానే సాగుతాయని నాసా తెలిపింది. 

ఆర్టెమిస్ అంటే గ్రీక్ పురాణాల ప్రకారం ఒక దేవత. జ్యూస్ కుమార్తె. అపోలోకు కవల సోదరి. ఆర్టెమిస్ యాత్రల్లో భాగంగా మహిళా వ్యోమగామికీ అవకాశం కల్పిస్తున్నందువల్ల ఈ దేవత పేరును నాసా ఎంచుకుంది.  ఈ ప్రాజెక్టు కోసం నాసా  9,300 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది.