యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించే వాట్సాప్ అకౌంట్లు బ్యాన్

యూజర్ల  ప్రైవసీకి భంగం కలిగించే వాట్సాప్ అకౌంట్లు బ్యాన్

మెటా వాట్సాప్‌ను కొనుగోలు చేసిన తర్వాత, వాట్సాప్  కూడా యూజర్ల ప్రైవసీ, పాలసీ విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీనికి కారణం వాట్సాప్‌ను సోషల్ మీడియా మాధ్యమంగా చేసుకొని కొందరు తప్పుడు, నకిలీ, ఇతరులకు హాని కలిగించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన భారత ఐటీ మంత్రిత్వ శాఖ ‘ఐటీ రూల్స్ 2021’ని తీసుకొచ్చింది. ఐటీ రూల్స్ లో భాగంగా.. ఏ యూజర్ అయినా వైలేషన్ ప్రేరేపించేవి, ఫేక్ న్యూస్, హరాజ్మెంట్ చేస్తుంటే, వాళ్ల వాట్సాప్ అకౌంట్‌ని బ్యాన్ చేసి, చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు.

అందులో భాగంగా వాట్సాప్ యూజర్ల నుంచి కంప్లైంట్స్, రిపోర్ట్ లు తీసుకుంటుంది. ఎవరైతే వాట్సాప్ అకౌంట్‌ని తప్పుగా వాడుతున్నారో, వాళ్ల అకౌంట్‌ని బ్యాన్ చేస్తుంది. దీని ప్రకారం అక్టోబర్  నెల మొత్తంలో వాట్సాప్ 23 లక్షల 24 వేల భారతీయ వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్ చేసింది. అందులో ఫేక్ ఐడెంటిటీ అకౌంట్స్ కూడా ఉన్నాయి.