వాటే ఐడియా: వాట్సాప్ సెక్యూరిటీకి.. ఈ మెయిల్ ప్రొటెక్షన్..

వాటే ఐడియా: వాట్సాప్ సెక్యూరిటీకి.. ఈ మెయిల్ ప్రొటెక్షన్..

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈమెయిల్ చిరునామా ఉపయోగించి వినియోగదారుల ఖాతాలను రక్షించే పనిలో పడింది. రక్షణ, ధృవీకరణ ప్రయోజనాల కోసం వారి ఇమెయిల్ అడ్రస్ లను అందించాలని ఈ మేసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను కోరింది. 

సాధారణంగా వాట్సాప్‌లోకి సైన్ ఇన్ చేయవలసి వస్తే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లోని OTP ద్వారా నంబర్‌ను ప్రామాణీకరించాలి. కానీ మెసేజింగ్ యాప్ ఇప్పుడు ఇమెయిల్ ID ద్వారా వారి ఖాతాను ధృవీకరించే ఎంపికను ప్రజలకు అందిస్తోంది.మీ ఫోన్ దొంగిలించబడినా లేదా మీరు కొన్ని కారణాల వల్ల దానికి యాక్సెస్‌ను కోల్పోయినా ఈమెయిల్ ఎంపిక ఉపయోగపడుతుంది. ఈమెయిల్ ID భద్రతతో మీరు మెయిల్ చిరునామాను యాక్సెస్ చేయగలిగినంత వరకు మరొక పరికరం నుంచి ఖాతాలోకి లాగిన్ చేయొచ్చు. 

ఇటీవలి కాలంలో WhatsApp Android వినియోగదారుల కోసం కొత్త భద్రతా సాధనాలను పరిచయం చేసింది. తెలియని ఫోన్ నెంబర్ల నుంచి వచ్చే మేసేజ్ లను మెరుగైన భద్రత చర్యలు తీసుకుంది. అదనంగా Android బీటాలో  ఫోన్ నంబర్‌తో లింక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు QR కోడ్‌ని స్కాన్ చేయకుండానే WhatsApp వెబ్‌కి వారి ఖాతాలను కనెక్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

జూలై (2023) లో  ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ Android బీటాలో మరొక అనుకూలమైన ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది మేసేజ్ లను పంపిస్తున్నపుడు కొత్త గ్రూప్ లను సృష్టించడానికి వినియోగదారులను అవకాశం కల్పించింది. 

వినియోగదారుల భద్రతను మెరుగుపర్చడానికి వాట్సప్  నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ మెయిల్ ఆధారిత ఖాతా రక్షణ ఫీచర్ అభివృద్ధి చేస్తోంది. దీంతోపాటు  భవిష్యత్ యాప్ కోసం మరిన్ని భద్రత పరమైన ఫీచర్ల అందించవచ్చు.