71 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్‌‌‌‌‌‌‌‌

71 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్‌‌‌‌‌‌‌‌
  •  ప్రభుత్వ రూల్స్ ప్రకారం చేపట్టిన కంపెనీ

న్యూఢిల్లీ: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ మోసాలను అరికట్టేందుకు వాట్సాప్  ఏకంగా 71 లక్షల అకౌంట్లను ఇండియాలో  కిందటేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాన్  చేసింది. కొత్త ఐటీ చట్టంలోని రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఈ చర్యలు చేపట్టింది. యూజర్ల నుంచి ఎటువంటి రిపోర్ట్స్ రాకుండానే  కిందటేడాది నవంబర్ 1 నుంచి 30 మధ్య 19,54,000 అకౌంట్లను బ్యాన్  చేశామని వాట్సాప్ పేర్కొంది. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8,841 ఫిర్యాదులు అందుకున్నామంది.  ఈ మెసేజింగ్ యాప్‌‌‌‌‌‌‌‌కు ఇండియాలో 50 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. సోషల్ మీడియా యూజర్లు  లేవనెత్తిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రభుత్వం  గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌ అప్పిలేట్‌‌‌‌‌‌‌‌ కమిటీ (జీఏసీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మోసాలను అరికట్టేందుకు ఓ స్పెషల్ టీమ్ పనిచేస్తోందని వాట్సాప్ ప్రకటించింది. మరోవైపు  వాట్సాప్ ఆండ్రాయిడ్‌‌‌‌‌‌‌‌ యూజర్లు  తమ చాట్‌‌‌‌‌‌‌‌లను ఫ్రీగా బ్యాకప్ చేసుకోవడానికి కుదరదు. ఈ సర్వీస్‌‌‌‌‌‌‌‌ను చాలా ఏళ్ల నుంచి గూగుల్ ఆఫర్ చేస్తోంది. వాట్సాప్‌‌‌‌‌‌‌‌ చాట్‌‌‌‌‌‌‌‌లు గూగుల్ వన్‌‌‌‌‌‌‌‌లో ఇక నుంచి స్టోర్ అవుతాయి.  గూగుల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్‌‌‌‌‌‌‌‌తో కలిసి గూగుల్ వన్‌‌‌‌‌‌‌‌  నెల వారి లేదా యాన్యువల్ బేసిస్‌‌‌‌‌‌‌‌లో సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది.