69 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్

69 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఇండియాకి చెందిన 69లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. ఆ కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2021 కొత్త ఐటీ రూల్స్ కి లోబడి సుమారు 69లక్షల సమస్యాత్మక అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది.

డిసెంబర్లో బ్యాన్ చేసిన అకౌంట్లు: డిసెంబర్ 1 నుండి 31వరకు 69,34000 అకౌంట్లను బ్యాన్ చేయటం జరిగిందని, వాటిలో 16, 58000 అకౌంట్లను ఎటువంటి యూజర్ రిపోర్ట్స్ లేకుండానే బ్యాన్ చేసినట్లు సంస్థ తెలిపింది.

కంప్లైంట్ రిపోర్ట్స్:డిసెంబర్లో 16వేలకు పైగా కంప్లైంట్స్ వచ్చాయని, వాటిలో 13 రిపోర్ట్స్ ఆధారంగా అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వాట్సప్ తెలిపింది. వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా పలు అకౌంట్లను బ్యాన్ చేయగా, కొన్నిటిని రిస్టోర్ చేసినట్లు తెలిపింది.

యూజర్ సేఫ్టీ రిపోర్ట్: యూజర్ సేఫ్టీ రిపోర్ట్ ని బేస్ చేసుకొని వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా అకౌంట్లను బ్యాన్ చేశామని, వాటిలో కొన్ని వినియోగదారుల నుండి వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా చేయగా , కొన్నిటిని సంస్థ నిబంధనల ప్రకారం బ్యాన్ చేసినట్లు స్పష్టం చేసింది.

గ్రీవెన్స్ ఆపాలేట్ కమిటీ: ఇండియన్ గవర్నమెంట్ గ్రీవెన్స్ ఆపాలేట్ కమిటీని ప్రారంబించింది. ఈకమిటీ సోషల్ మీడియా సంస్థల సమస్యల మీద పని చేస్తుంది.

నవంబర్లో బ్యాన్ చేసిన అకౌంట్లు:వాట్సాప్ సంస్థ నవంబర్లో కూడా ఇండియాకి సంబందించిన  71లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. భద్రతా ప్రమాణాల దృష్ట్యా అకౌంట్లను బ్యాన్ చేసినట్లు సంస్థ ఇచ్చిన నివేదికలో తెలిపింది. భద్రతా ప్రమాణాలు లక్ష్యగా తమ సంస్థలో అనేకమంది డేటా సియాటిస్టులు, రీసెర్చర్లు, ఇంజినీర్లు, న్యాయశాస్త్ర నిపుణులు పని చేస్తున్నారని సంస్థ పేర్కొంది.