వాట్సాప్లో కాల్ లింక్ ఫీచర్

వాట్సాప్లో కాల్ లింక్ ఫీచర్

వాట్సాప్ మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో కొత్త మార్పును తీసుకొచ్చింది. అప్పటి వరకు మామూలు కాల్స్, టెక్స్ట్ మెసేజ్ లకి అలవాటు పడిన జనాలు, వాట్సాప్ రాకతో  వీడియో కాల్స్ కి  మారారు. అలా వాట్సాప్ చాలామందికి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది.  ప్రైవసీ, సేఫ్టీకే కాకుండా యూజర్లకు సులువుగా ఉండేలా ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ తీసుకొస్తోంది. తాజాగా వాట్సాప్ కాల్ లింక్ ఫీచర్ను  అందుబాటులోకి తీసుకొచ్చింది.

జూమ్ కాల్, గూగుల్ మీట్ తరహాలో కాల్ లింక్ ఫీచర్ పని చేస్తుంది. ఆడియో, వీడియో గ్రూప్ కాల్స్ మాట్లాడుకునే వాళ్లకు కాల్ లింక్ ఫీచర్ సాయపడుతుంది. అంటే ఇప్పటి వరకు వాట్సాప్ గ్రూప్ కాల్ మాట్లాడాలంటే కాల్ మధ్యలో వ్యక్తులను యాడ్ చేయాల్సి వచ్చేది. అయితే కొత్తగా తెచ్చిన కాల్ లింక్ ఫీచర్ వల్ల గ్రూప్ సభ్యులందరికీ కలిపి లింక్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన లింక్ ను కాంటాక్ట్స్ కి షేర్ చేయాలి. ఆ లింక్ ఉపయోగించి యాజర్లు గ్రూప్ కాల్స్ లో జాయిన్ అవ్వొచ్చు. కాల్ లింక్ ను ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ల్లో కూడా షేర్ చేసుకునేలా వాట్సప్ దాన్ని రూపొందించింది.