త్వరలో వాట్సాప్ లో పేమెంట్ ఆప్షన్

త్వరలో వాట్సాప్ లో పేమెంట్ ఆప్షన్

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 400 మిలియన్ల యూజర్లున్న వాట్సాప్ తన వినియోగదారులకు రకరకాల సర్వీసులను అందిస్తోంది. గూగుల్ పే, పేటీఎం లకు పోటీగా త్వరలో డిజిటల్ పేమంట్ సర్వీస్ ను కూడా అందుబాటులోకి తేనుంది. ఈ విషయాన్ని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ తెలిపారు. 2019 చివరికల్లా ఈ పేమెంట్ ఆప్షన్‌ను తీసుకురానున్నామని, ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో పరీక్షించిన తర్వాత సర్వీస్ ను లాంచింగ్‌కు రెడీ చేయనున్నామని ఆయన తెలిపారు.

ఇప్పటికే మెసెజ్ సర్వీసులతో పాపులర్ అయిన వాట్సాప్ డిజిటల్ ఎకానమీలో కూడా భాగస్వామ్యం అవుతుందని ఆయన అన్నారు. ఒకరి నుంచి మరొకరికి డబ్బులు పంపించుకునేందుకు, యూపీఐ ఆధారిత సేవల కోసం ఉపయోగించేలా ఈ వాట్సాప్ పే ఉంటుందని ఆయన తెలిపారు.