
సోషల్ మీడియా వాట్సాప్… త్వరలో డిజిటల్ చెల్లింపుల సేవలను భారత్‌లో ప్రారంభించనుంది. డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలన్న రిజర్వు బ్యాంకు నిబంధనలకు పూర్తి స్థాయిలో ఈ సంస్థ ఓకే చెప్పడంతో ఆ దిశగా ముందడుగు పడుతోంది. ప్రస్తుతం డేటా నిల్వ, ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఖరారు చేస్తోంది. అంతా అనుకున్న విధంగానే జరిగితే అక్టోబర్-డిసెంబర్ మధ్య వాట్సాప్ తన చెల్లింపుల సేవలను ప్రారంభించనుంది.