వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్.. వాడని గ్రూప్స్ ఆటో డిలీట్

వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్.. వాడని గ్రూప్స్ ఆటో డిలీట్

వాట్సాప్.. యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్ పైరింగ్ గ్రూప్స్ పేరుతో కొత్త అప్ డేట్ ని తీసుకురానుంది. సాధారణంగా చాలామంది కొద్దిరోజుల కోసం వాట్సాప్ గ్రూప్ లు క్రియేట్ చేసుకుంటుంటారు. ఆ తర్వాత ఆ గ్రూప్స్ ను డిలీట్ చేయడం మర్చిపోతుంటారు. అలాంటివాళ్ల కోసం ఎక్స్ పైరింగ్ గ్రూప్స్ పేరుతో వాట్సాప్ కొత్త అప్ డేట్ తీసుకొస్తోంది. దీనివల్ల యూజర్ అనుకున్ని నిర్ణీత కాలవ్యవధిలో ఆ గ్రూప్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. ఈ ఫీచర్ కావాలంటే గ్రూప్ క్రియేట్ చేసుకునేటప్పుడే సెట్టింగ్స్ లో సెలక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం బీటా టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వాట్సాప్ ప్రకటిచింది.