
హైదరాబాద్, వెలుగు: సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, వినియోగదారులకు మెరుగైన అనుభవాలను అందించడానికి వాట్సాప్ తన రెండో వార్షిక వ్యాపార సదస్సును ముంబైలో నిర్వహించింది. ఈ సందర్భంగా వ్యాపార వృద్ధికి ఉపయోగపడే పలు కొత్త ఫీచర్లను, టూల్స్‌ను పరిచయం చేసింది.
చిన్న వ్యాపారాలు త్వరగా క్యూఆర్ కోడ్లను షేర్ చేసి, కస్టమర్ల నుంచి డబ్బు పొందవచ్చు. పెద్ద వ్యాపారాలకు వినియోగదారులు నేరుగా ఒకే ట్యాప్‌తో యాప్ నుంచి కాల్ చేసేందుకు వీలు కల్పించే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేసింది. వాట్సాప్ స్టేటస్‌లోని ప్రకటనలు, ప్రమోటెడ్ ఛానెల్స్, ఛానెల్స్ సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా ఇవి తమ వ్యాపారాన్ని పెంచుకోవచ్చని కంపెనీ పేర్కొంది.