ఇండియా సిమ్.. పాకిస్తాన్‎లో వాట్సాప్

ఇండియా సిమ్.. పాకిస్తాన్‎లో వాట్సాప్
  • ఇండియా సిమ్.. పాకిస్తాన్‎లో వాట్సాప్
  • నేవీ,డిఫెన్స్‌‌‌‌ అధికారులే టార్గెట్​గా  హనీ ట్రాప్!

హైదరాబాద్‌‌‌‌,వెలుగు: ఏపీలో టెర్రరిస్ట్​ కార్యాకలాపాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు వేగవంతం చేసింది. విశాఖపట్నంలో పని చేస్తున్న 11 మంది నేవీ అధికారులను నిరుడు పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్లు ట్రాప్ చేశారు. దీనిపై 2020 జనవరి 10న ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కేసు పెట్టింది. ఈ ఘటనపై 2021 డిసెంబర్ 23న ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్ కేసు రిజిస్టర్ చేసి.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ తో కలిసి 'ఆపరేషన్ డాల్ఫిన్ నోస్' పేరుతో దర్యాప్తు చేసింది. విశాఖపట్నం,  గుజరాత్ లోని గోద్రా, బుల్దాన, మహారాష్ట్రలో గురువారం సోదాలు చేశారు. నేవీ అధికారులను హనీ ట్రాప్ చేసి దేశ రహస్యాలు తెలుసుకోవడానికి పాక్ ఏజెంట్లు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. స్థానికంగా ఉన్న ఏజెంట్లతో ఫేక్ సిమ్ కార్డులు కొనిపించి.. ఆపై ఓటీపీలు తెలుసుకొని పాకిస్తాన్​లో వాట్సాప్ యాక్టివేట్ చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. నేవీ, డిఫెన్స్ ఆఫీసర్లతో పరిచయాలు పెంచుకొని, దేశ భద్రతకు సంబంధించిన సమాచారం పాక్ ఏజెంట్స్ వాట్సప్ ద్వారా హ్యాక్ చేసినట్లు ఎన్ఐఏ వివరించింది.