వాట్సాప్ నుంచే ఏ యాప్ కైనా మెసేజ్.. వాట్సాప్ లో కొత్త ఫీచర్

వాట్సాప్ నుంచే ఏ యాప్ కైనా మెసేజ్.. వాట్సాప్ లో కొత్త ఫీచర్

వాట్సాప్ యూజర్స్ పెంచుకోవడం కోసం మెటా ఎన్నో ఫీచర్స్ అందిస్తోంది. ప్రతి ఒక్కరు ఎక్కువగా వాడే యాప్స్ లో కచ్చితంగా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మొదట మెసేజ్ చేసుకోవటానికి మాత్రమే వీలున్న ఈ యాప్ ఆ తర్వాత ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూ ఉంది. తాజాగా చాట్ చేసుకోవడానికి వాట్సాప్ లోనే మరో థార్డ్ పార్టీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇది ఒక ఫ్లాట్ ఫాం నుంచి మరొ ఫ్లాట్ ఫాంకు డేటా షేర్ చేసుకోవడానికి కూడా ఈసీగా పని చేస్తుంది. ఈ ఫీచర్ అనబుల్ చేసుకోవడానికి  యూజర్స్ పర్మిషన్ ఇవ్వాల్సిఉంటుంది. చాటింగ్ కి యూస్ చేసే యాప్ యూజర్సే డైరెక్ట్ గా సెలక్ట్ చేసుకుంటారు. 

యూరోపియన్ యూనియన్ కొత్త డిజిటల్ మార్కెట్ యాక్ట్ మేనేజింగ్ ఫ్లాట్ ఫాంల మధ్య ఇంటర్ ఆపరేటబిలిటీ ని తప్పనిసరి చేయడం వల్ల వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది.

స్పెషల్ యాప్ లేకుండా టెలిగ్రామ్, సింగల్ వంటి వేరే యాప్స్  నుంచి మెసేజ్ చేసుకోవచ్చు. రిప్లే కూడా వాట్సాప్ తోనే ఇచ్చే వీలు ఈ ఫీచర్ తో రానుంది. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది DMA(డిజిటల్ మార్కెట్ యాక్ట్) నిబంధనలకు అనుగుణంగా యూరప్‌లోనే విడుదల చేస్తారని అనుకుంటున్నారు. ఈ ఫీచర్ లో ప్రైవసీ టెస్టింగ్ అవుతుంది. థార్డ్ పార్టీ చాట్ ఫీచర్ DMA గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఉంటుంది. డేటా షేరింగ్, కమ్యూనికేషన్, కనెక్టింగ్ లపై నియంత్రణ ఉంటుంది.