వాట్సాప్లో సరికొత్త ఫీచర్.. ఛానల్స్ను వీక్షించవచ్చు

వాట్సాప్లో సరికొత్త ఫీచర్.. ఛానల్స్ను వీక్షించవచ్చు

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న వాట్సాప్..సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.  టెలిగ్రామ్ ఛానల్ తరహాలో వాట్సాప్ ఛానల్స్  ఫీచర్ ను లాంఛ్ చేసింది. ఈ వాట్సాప్  ఛానల్ ను  సబ్స్క్రయిబ్ చేసుకొని మనకు నచ్చిన కంటెంట్ ను వీక్షించవచ్చు . 

వాట్సాప్ ఛానల్స్ అంటే ఏమిటి..?

వాట్సాప్ ఛానల్స్ అనేది ప్రైవేట్ బ్రాడ్ కాస్టింగ్ టూల్.  యూజర్ మొబైల్ నెంబర్ కానీ ఇతర సమాచారం కానీ ఎవరికీ తెలియదు . కేవలం యూసర్ నేమ్ తో మాత్రమే వాట్సాప్ ఛానల్ ను  సెర్చ్ చేయగలడు. బ్రాడ్ కాస్టింగ్ టూల్ తరహాలో ఉన్న వాట్సాప్ ఛానల్ ను... వివిధ రకాల అంశాలపై  క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ మాత్రమే  ఫోటోలు, వీడియోలు, స్టిక్లర్లు, పోల్స్, టెక్ట్స్ పంపించగలడు.  ఇందులో యూజర్ స్పోర్ట్స్ టీమ్స్, అలవాట్లు, స్థానిక అధికారుల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. యూజర్లు ఎవరి ఛానల్ లో అయినా లింక్ ద్వారా జాయిన్ అవ్వొచ్చు. 

  
భద్రత..గోప్యత..

వాట్సాప్ యూజర్లు ఏ ఛానల్‌లకు సభ్యత్వాన్ని పొందాలి అనేదానిపై కంట్రోల్ కలిగి ఉంటారు. యూజర్లు ఎవరిని కాంటాక్ట్‌లుగా యాడ్ చేశారు అనేది ఇతరులు చూడలేరు. అంతేకాదు  వ్యక్తిగత వాట్సాప్ యూజర్లు ఎంచుకోని కంటెంట్‌ను వారికి అందించదు. వాట్సాప్ యూజర్ల ప్రమేయం లేకుండా ఆటో సబ్ స్ర్కిప్షన్ అందించదు. ఇక అల్గారిథమ్, సోషల్ అకౌంట్ల ద్వారా కంటెంట్‌ను ఛానల్‌లకు సిఫార్సులు చేయదు. వాట్సాప్ ఛానల్‌లు నిర్దిష్ట వాట్సాప్ ఛానల్‌ని వాట్సాప్‌లో యూజర్ నేమ్‌ను రిజిస్టర్ చేయడం ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లకు తమకు నచ్చిన అప్‌డేట్స్ ఈజీగా పొందవచ్చు.  యూజర్ల ఫోన్ నెంబర్లు బహిర్గతం చేయబడదు. వాట్సాప్ వినియోగదారులు ఎవరిని ఫాలో అవ్వాలని నిర్ణయించుకుంటారో అది ప్రైవేటుగా ఉంటుంది. 

30 రోజులు మాత్రమే ఉంటాయి. 

వాట్సాప్ ఛానల్స్ లో యూజర్ల పోస్ట్ చేసిన వీడియోలు, ఫోటోలు, రాతలు కేవలం 30 రోజులు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత వాటంతటవే మాయమవుతాయి.  తాము పోస్ట్ చేసిన వీడియోలు, రాతలు, ఫోటోలను స్క్రీన్ షాట్ తీయకుండా..ఫార్వార్డ్ చేయకుండా  అడ్మిన్ లు బ్లాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా వాట్సాప్ ఛానల్ లో తమను ఎవరు ఫాలో అవ్వాలి..డైరెక్టరీలో ఛానల్ ను ఎవరైనా వీక్షించవచ్చా లేదా అనేది అడ్మిన్ లే నిర్ణయించుకునే వీలుంది. 

సమాచారం ఓపెన్ గా ఉంటుంది..

వాట్సాప్ ఛానల్ కోట్ల మందికి చేరువకావడమే లక్ష్యం కాబట్టి..ఛానల్ డిఫాల్ట్ గా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్ట్ చేయబడలేదు. 

మొదట ఏఏ దేశాల్లో అందుబాటులో ఉంటుంది.

వాట్సాప్ ఛానెల్స్  మొదట సింగపూర్, కొలంబియాలో అందుబాటులో ఉంటాయి. క్రమంగా ఈ వాట్సాప్ ఛానల్స్ ప్రపంచంలోని ఇతర దేశాలకు విస్తరిస్తుంది. 

వాట్సాప్ ఛానల్స్ చెల్లింపులను సపోర్ట్ చేస్తాయా..?

వాట్సాప్ ఛానల్స్ వాట్సాప్ చెల్లింపులకు మద్దతు ఇస్తుంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.  వాట్సాప్ చెల్లింపుల ఆప్షన్ ను అడ్మిన్ లు ఎంచుకోవాల్సి ఉంటుంది.