వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఫోటోలు ఒక్కసారి చూస్తే మళ్లీ కనిపించవు

V6 Velugu Posted on Aug 04, 2021

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ యాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మనం ఎవరికైనా ముఖ్యమైన ఫోటోలను పంపాల్సి వస్తే.. వాటిని అవతలి వారు ఒకసారి మాత్రమే చూసేలా పంపొచ్చు. మనం పంపిన ఫోటోలు, వీడియోలను అవతలి వారు చూసిన తర్వాత.. మళ్లీ వాటిని ఓపెన్ చేయడం కుదరదు. ఇందుకోసం ‘వ్యూ వన్స్’ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. 

వ్యూ వన్స్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
ఈ వ్యూ వన్స్ ఫీచర్ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్‌లన్నింటిలోనూ పనిచేస్తుంది. ఈ ఫీచర్ వల్ల మన ప్రైవసీ ఫోటోలను అవతలివారు ఒక్కసారి మాత్రమే చూడగలరు. దాంతో వినియోగదారుని ప్రైవసీకి ఎటువంటి ఆటంకం కలగదు. వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరచడమే ఈ ఫీచర్ లక్ష్యమని కంపెనీ పేర్కొంది. ఫోన్‌లలో ఫోటోలు, వీడియోల వల్ల స్టోరేజీ ఫుల్ అవుతుంది. ఆ ఫోటోలను మనం వెతికి డిలీట్ చేయాల్సి వస్తోంది. కానీ, ఈ ఫీచర్‌ను యాప్‌లో  సెట్ చేసుకోవడం వల్ల మనం ఒకసారి చూసిన తర్వాత ఫోటోలు కనిపించకుండా పోతాయి.

ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది
మీరు మీ వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో ‘వ్యూ వన్స్’అనే ఆప్షన్ చూడవచ్చు. మీరు ఏదైనా ఫోటోను రిసీవ్ చేసుకున్నప్పుడు.. ప్రివ్యూ కనిపించదు. మీరు ఆ ఫోటోను ఒకసారి చూసిన తర్వాత.. స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ మెసెంజర్‌ల వలె  మళ్లీ చూడలేరు. ఫోటోను చూసిన తర్వాత.. మళ్లీ ఓపెన్ చేయాలని చూస్తే ఓపెన్డ్ అనే మెసెజ్ కనిపిస్తుంది.

వాట్సాప్‌లో కెమెరాను ఉపయోగించి ఒక ఫోటో లేదా వీడియోను స్నాప్ చేసి అనంతరం.. 1 అనే సింబల్‌ను ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీరు తీసిన వీడియోను పంపిస్తే.. రిసీవ్ చేసుకున్నవాళ్లు ఆ వీడియోను ఒక్కసారి మాత్రమే చూడగలరు. 

ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే.. 
ఈ ఫీచర్ ఈ వారంలోనే వినియోగదారులందరికీ అందుబాటులోకి రాబోతోందని వాట్సాప్ తెలిపింది. కాబట్టి, మీ ఫోన్‌లో ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాకపోతే.. మీ వాట్సాప్ యాప్‌ను ఒకసారి అప్‌డేట్ చేయండి.

Tagged WhatsApp, Social media, View Once feature, photos and videos, whatsapp users

Latest Videos

Subscribe Now

More News