వాట్సాప్ మీడియా ఫైల్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. మీ డివైజ్లో సేవ్ కాకుండా ఇలా చేయండి

వాట్సాప్ మీడియా ఫైల్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. మీ డివైజ్లో సేవ్ కాకుండా ఇలా చేయండి

వాట్సాప్ మేసేజింగ్ యాప్ అంటే తెలియని వారుండరు. వాట్సాప్ ను ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరం ఉపయోగిస్తున్నాం.మేసేజ్, ఆడియో, వీడియో కాల్స్ కు వాట్సాప్ మేపేజింగ్ యాప్ ప్రత్యేకమైనది.అయితే వాట్సాప్లో మీడియా ఫైల్స్ మేనేజ్ మెంట్ గురించి చాలా మందికి తెలియదు. వాట్సాప్ మీడయా ఫైల్స్ అంటే .. మేసేజ్ ల ద్వారా మన డివైజ్లోకి వచ్చే ఫొటోలు, వీడియాలు. వీటితో డివైజ్ స్టోరేజ్ నిండిపోయి ఇబ్బంది పడుతుంటారు చాలామంది. అయితే ఎలా మేనేజ్ చేయాలి.. మీడియా ఫైల్స్ మన డివైజ్ లో సేవ్ కాకుండా ఇలా చేయాలని చెప్తోంది వాట్సాప్. 

WhatsApp మీడియా సెట్టింగ్ లను నిర్వహించడం ద్వారా మీ డివైజ్ గ్యాలరీలో అనవసరమైన, అయోమయానికి గురి చేసే మీడియా ఫైల్స్  సేవ్ కాకుండా చేయొచ్చు. మీ ఫోన్ పనితీరు మెరుగు పర్చేందుకు,అనసవరమైన ఫైల్స్ లేకుండా స్టోర్ చేసేందుకు ఈ క్రింది విధంగా చేయాలి. 
మనం WhatsApp లో మీడియాను డౌన్ లోడ్ చేసినప్పుడు అది డీఫాల్ట్ గా మీ గ్యాలరీలో సేవ్ చేయబడుతుంది. మీడియా విజిబిలిటీ  సెట్టింగ్ సాధారణంగా ఆన్ చేయబడి ఉంటుంది. డీఫాల్ట్ సెట్టింగ్ లను మార్చడం ద్వారా మీడియా ఫైల్స్ మీ డివైజ్ లో సేవ్ కాకుండా చేయొచ్చు. 
1.ముందుగా వాట్సాప్ విండోలో కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలను  క్లిక్ చేయాలి. 
2.సెట్టింగ్ లోకి అందులో Chats  ను క్లిక్ చేయాలి. 
3. Media visibility ని ఆఫ్ చేయడంలో మీ డివైజ్ లో మీడియా ఫైల్స్ సేవ్ కాకుండా అడ్డుకోవచ్చు. 
అయితే ఇందులో ప్రత్యేకించి ఈ కొన్ని చాట్ ల నుంచి మీడియా ఫైల్స్ సేవ్ కాకుండా అడ్డుకునే ఆప్షన్ కూడా ఉంది. మీరు చేయాల్సింది.. Chat (or) Group ను ఓపెన్ చేసి..More ను నొక్కాలి. Introduce/ Group Information లేదా Name క్లిక్ చేసి మీడియా విజిబిలిటీ రద్దు సెలెక్ట్ చేసుకుని OK క్లిక్ చేస్తే సరిపోతుంది. 

త్వరలో వాట్సాప్ లో కొత్త ఫీచర్
వినియోగదారులకు సౌలభ్యం, సేఫ్టీ లక్ష్యంగా వాట్సాప్ ఎప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులో తెస్తూనే ఉంది. అయితే ఈ సారి మరో కొత్త ఫీచర్ ను కూడా పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం బీటా టెస్లింగ్ దశలో ఉంది. దీని పేరు రిప్లై బార్ (Reply Bar). ఇది వాట్సాప్ లో ఇతర వినియోగదారుల స్టేటస్ అప్ డేట్ చేసినప్పుడు వాటికి రిప్లై ఇచ్చేందుకు ఉపయోగపడే కొత్త ఫీచర్. ఇది రిప్లై ఇవ్వడానికి మెనూ కోసం స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. ఇది ఇన్ స్టాగ్రామ్ విధానాన్ని పోలి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వినియోగదారులు.. ఇతరులు చేసిన స్టేటస్ అప్ డేట్ కు నేరుగా రిప్లై ఇవ్వొచ్చు. 
WABetaInfo  ప్రకారం.. స్టేటస్ అప్ డేట్ ల కోసం రిప్లై బార్ Android, iOSలలో అందుబాటులో ఉంటుంది.