వాట్సాప్ లో ఈజీగా పాత మెసేజెస్ వెతకొచ్చు

వాట్సాప్ లో ఈజీగా పాత మెసేజెస్ వెతకొచ్చు

వాట్సాప్ వినియోగాన్ని మరింత సులభతరం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు వస్తున్నాయి.  ఈక్రమంలోనే త్వరలో మరో ఫీచర్ రాబోతోంది. ప్రస్తుతం మనం పాత వాట్సాప్ చాట్ ను  వెతకడానికి..  సెర్చ్ బాక్స్ లో ఏదైనా ఒక పదాన్ని టైప్ చేస్తున్నం. పదాన్ని టైప్ చేశాక.. ఆ పదం ప్రస్తావన ఉన్న పాత మెసేజెస్ అన్నీ మన ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. వాటిలో మనకు అవసరమైన మెసేజ్ ను చూసేందుకు పాత చాట్ ను స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇదే పని కోసం ఇకపై మరో అదనపు ఆప్షన్ ను వాట్సాప్ తీసుకురాబోతోంది. త్వరలో డేట్ ఆధారంగా పాత చాట్ ను పొందే ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

ఈ ఫీచర్ ద్వారా పాత వాట్సాప్ చాట్ ను స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా..  క్యాలెండర్ ఐకాన్ లో ఎంపిక చేసిన డేట్ రోజు చేసిన మెసేజ్ లను నిర్దిష్టంగా ఓపెన్ చేసి చూడొచ్చు. ఫలితంగా నెటిజన్స్ విలువైన సమయం ఆదా కూడా అవుతుంది. గత రెండేళ్లుగా ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తేవాలని వాట్సాప్ యోచిస్తోంది. ఇది అందుబాటులోకి వచ్చాక.. వాట్సాప్ సెర్చ్ బార్ పై క్లిక్ చేయగానే క్యాలెండర్ ఐకాన్ కనిపిస్తుంది. అందులో తేదీపై ట్యాప్ చేస్తే.. ఆ రోజు వచ్చిన మెసేజ్ లు చాట్ పేజీలో కనిపిస్తాయి. అలా కిందకు స్క్రోల్ చేస్తూ తర్వాతి, ముందు రోజు మెసేజ్ లను కూడా యూజర్ చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.