ధరణి ఫిర్యాదులకు వాట్సాప్  నంబర్

ధరణి ఫిర్యాదులకు వాట్సాప్  నంబర్

91330 89444 కు కంప్లయింట్స్​ పంపాలన్న సర్కార్​
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్‌‌‌‌లో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎస్​ సోమేశ్​కుమార్​ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌‌కు సంబంధించిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని తీసుకొచ్చారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్కే భవన్ లో ధరణి పోర్టల్‌‌పై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులను 91330 89444 నంబర్ కు వాట్సాప్ లేదా [email protected]కు మెయిల్ చేయాలని కోరారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి వాట్సాప్ నంబర్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కలెక్టర్లు ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు.