WhatsApp Accounts: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. 67 లక్షల అకౌంట్లను తొలగించింది

WhatsApp Accounts: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. 67 లక్షల అకౌంట్లను తొలగించింది

వాట్సాప్ యూజర్లకు బిక్ షాక్.. గత కొంతకాలంగా అకౌంట్ల ఏరివేత చేపట్టిన వాట్సాప్ మాతృ సంస్థ మెటా.. తాజా జనవరి నెలలో ఒక్క భారత్ లోనే 67 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. జనవరి 1 నుంచ 31 మధ్య కంపెనీ 67లక్షల 28వేల ఖాతాలను నిషేధించంది. అత్యంత ప్రజాదరణ పొందిన మేసేజింగ్ ఫ్లాట్ ఫార్మ్ వాట్సాప జనవరిలో దేశంలో రికార్డు స్థాయిలో 14వేల 828 ఫిర్యాదులను అందుకుంది. ఫిర్యాదుల మేరకు చర్య తీసుకుంది. 

లక్షలాది మంది భారతీయ సోషల్ మీడియా వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC0 ని ప్రారంభించింది. ఇది కంటెంట్, ఇతర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ప్యానెల్ బిగ్ టెక్ కంపెనీల నియంత్రణ, డిజిటల్ చట్టలను పటిష్టం చేయడం, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ల నిర్ణయాలకు వ్యతిరేకంగా కస్టమర్ల ఫిర్యాదులను  పరిశీలిస్తుంది. గతేడాది (2023) డిసెంబర్ లో వాట్సాప్ దేశవ్యాప్తంగా 69 లక్షలకు పైగా బ్యాడ్ అకౌంట్లను నిషేధించింది.