
యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. సెక్యూరిటీతో కూడిన ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. తాజాగా వాట్సాప్ మరికొన్ని యూజర్ ఫ్రెండ్లీ అప్ డేట్స్ తీసుకొచ్చింది.
షార్ట్ కట్ బ్లాక్: వాట్సాప్లో అన్ నోన్ కాంటాక్ట్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని బ్లాక్ చేయాలంటే వాట్సాప్ లోకి వెళ్లి, కాంటాక్ట్ ఓపెన్ చేసి ఐకాన్స్.. సెట్టింగ్స్ లోకి వెళ్లి కాంటాక్ట్ బ్లాక్ చేయాల్సి ఉంటుంది. కానీ కొత్తగా తీసుకొచ్చిన అప్ డేట్ తో కాంటాక్ట్ బ్లాకింగ్ ప్రాసెస్ ఈజీ అయింది. అన్ నోన్ కాంటాక్ట్స్ నుంచి మెసేజ్, కాల్స్ వస్తే నోటిఫికేషన్ పాప్అప్ లోనే బ్లాక్ దిస్ కాంటాక్ట్ అని చూపిస్తుంది. దాంతో డైరెక్ట్ హోమ్ స్క్రీన్ నుంచే బ్లాక్ చేయొచ్చు.
కెమెరా ఈజీ స్విచ్ : వాట్సాప్ కెమెరాతో ఫొటో, వీడియో తీస్తుంటే ఫొటో మోడ్ నుంచి వీడియో మోడ్ కి స్విచ్ కాలేము. రీసెంట్ అప్ డేట్ లో ఫొటో నుంచి వీడియో మోడ్ కి ఈజీగా స్విచ్ కావచ్చు. కెమెరా బటన్ కింద కనిపించే ఫొటో, వీడియో మోడ్స్ ఉపయోగించి మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.