
యూజర్లను ఆకట్టుకునేందుకు మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. ఇప్పుడు డెస్క్‌టాప్ స్క్రీన్ లాక్, వ్యూ వన్స్ టెక్స్ట్, ఆడియో మెసేజ్ ఇన్ టూ టెక్ట్స్ ఫీచర్స్ తీసుకురానుంది. వెబ్ వాట్సాప్ వాడేవాళ్లకు డెస్క్ టాప్ స్క్రీన్ లాక్ ఫీచర్ పనికొస్తుంది. వాట్సాప్ లాగిన్ అయి కంప్యూటర్ కు దూరంగా ఉన్న టైంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
వ్యూ వన్స్ ఇమేజ్ తరహాలోనే వ్యూ వన్స్ టెక్ట్స్ ఫీచర్‌ని తీసుకొచ్చింది. అంటే ఇంపార్టెంట్ మెసేజ్‌లను వ్యూ వన్స్ టెక్ట్స్ రూపంలో పంపించుకోవచ్చు. వాట్సాప్‌లో వచ్చిన వాయిస్ మెసేజ్‌లను అందరిముందు వినడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ల కోసం వాట్సాప్ ఆడియో ఇన్‌టూ టెక్ట్స్ మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాయిస్ మెసేజ్ ను టెక్ట్స్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. వాటితో పాటు ఫొటోలు, వీడియోలు మరింత సులభంగా తీసుకునేందుకు డెడికేటెడ్ వీడియో మోడ్ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఒకే నెంబర్‌ను అనేక ఫోన్లలో వాట్సాప్ లాగిన్ అయ్యే వీలు కల్పించింది.