Whatsapp new update : వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్‌లో పెట్టొచ్చు 

Whatsapp new update : వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్‌లో పెట్టొచ్చు 

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ రెండు కొత్త అప్‌డేట్స్‌ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం ఫొటోలు, వీడియోలను మాత్రమే స్టేటస్‌లో పెట్టే వీలుండగా.. ఇప్పుడు ‘వాయిస్ రికార్డ్ ఇన్ స్టేటస్’ ఫీచర్‌‌ అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్‌లో పెట్టొచ్చు. ఆల్బమ్‌ నుంచైనా లేదా వాట్సాప్ స్టేటస్ నుంచైనా వాయిస్ రికార్డ్ చేసుకునే సదుపాయం కల్పించింది. వాట్సాప్ కెమెరా పక్కనుండే వాయిస్ రికార్డ్ సింబల్ నుంచి వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో ఇతరులకు పంపిన ఫొటోలు, వీడియోలు ఆటోమెటిక్‌గా కంప్రెస్ అయి (తక్కువ క్వాలిటీ) షేర్ అవుతాయి. ఇప్పుడు తీసుకొచ్చే కొత్త ఫీచర్‌‌ ద్వారా యూజర్లు ఒరిజినల్ క్వాలిటీతో ఇతరులకు ఫొటోలు పంపే వీలుంటుంది. యూజర్లు ఫొటోను షేర్ చేసే ముందు క్వాలిటీని మార్చుకునేందుకు ఇమేజ్ ప్రివ్యూ సెక్షన్‌ జోడించనుంది. దీంతో యూజర్లకు తాము పంపే ఫొటోపై పూర్తి నియంత్రణ ఉంటుంది.