WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..

WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..

ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వాట్సాప్ కి  పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో నిలదొక్కుకోలేలపోయాయి. యూజర్స్ అవసరాలు, అభిరుచిని బట్టి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ ఇవ్వటమే ఇందుకు కారణమని చెప్పచ్చు. తాజాగా వాట్సాప్ నుండి మరో కొత్త అప్డేట్ వచ్చింది. చాట్ ఫిల్టర్ ఫీచర్ ని కొత్తగా లాంచ్ చేసింది వాట్సాప్ సంస్థ. ఈ ఫీచర్ ద్వారా మనకు కావాల్సిన చాట్ కోసం స్క్రోల్ చేసే అవసరం లేకుండా సర్చ్ చేసి మెసేజ్ లు చూసుకోవచ్చు.

చాట్ ఫిల్టర్ ఫీచర్ 2020లో జీమెయిల్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఇదే ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది మెటా సంస్థ. మొదట ఆండ్రాయిడ్ వర్షన్ 2.22. 16.14లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. అంతే కాకుండా వాట్సాప్ లో యాక్టివ్ గా లేని యూజర్స్ ని ఐడెంటిఫై చేసే మరో ఫీచర్ ని కూడా టెస్టింగ్ చేస్తున్నట్టు వాట్సాప్ సంస్థ తెలిపింది.