WhatsAppలో కొత్త ఫీచర్.. సేవ్ చేయకుండానే కొత్త నెంబర్లతో చాట్ చేయొచ్చు..

WhatsAppలో కొత్త ఫీచర్.. సేవ్ చేయకుండానే కొత్త నెంబర్లతో చాట్ చేయొచ్చు..

మెటా ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్పప్ యూజర్లకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. సేవ్ చేయని నెంబర్ల ద్వారా చాటింగ్, పరిచయాలకు సంబంధించిన కొత్త ఫీచర్ ను ప్రారంభించింది. ఇది  iOS, Android ఫోన్లలో అందుబాటులో ఉంది. ఇంతకుముందు వినియోగదారులు తమ కాంటాక్టు సమాచారాన్ని ముందుగా సేవ్ చేయకుండా WhatsAppలో ఎవరితోనైనా చాట్ చేసేందుకు పరిమితులు ఉండేవి. థర్డ్-పార్టీ యాప్‌లు లేదా అధికారిక క్లిక్- టు -చాట్ APIలను ఆశ్రయించాల్సి వచ్చేది.  ఇది కొంతమంది వినియోగదారులకు అసౌకర్యంగా కలిగి ఉండొచ్చు. అయితే ఈ తాజా ఫీచర్‌తో అడ్రెస్ బుక్ లో పరిచయాలను సేవ్ చేయాల్సిన అవసరం లేకుండానే సంభాషణ ప్రారంభించే ప్రక్రియను  సులభతరం చేయడమే ఈ ఫ్లాట్ ఫారమ్ లక్ష్యం. 

కొత్త ఫీచర్ ను అనుసరించేందకు యూజర్లు ఈ క్రింది విధంగా చేయాల్సి ఉంటుంది. 

  1. మొదట కాంటాక్టు లిస్ట్ ను ఓపెన్ చేసిన మీకు కావాల్సిన ఫోన్ నెంబర్ ను వెదకాలి. 

  2. iOS కోసం అయితే WhatsAppలో చాట్ జాబితాలోని "Start new chat" బటన్‌ను ప్రెస్ చేయాలి. 

  3. సెర్చ్ బార్ లో మీరు కోరుకుంటున్న నెంబర్ ను ఎంటర్ చేయాలి. 

  4. WhatsAppలో పరిచయం ఉన్నట్లయితే వారితో చాట్ చేయొచ్చు. 

  5. ఇవే దశలు ఆండ్రాయిడ్ ఫోన్లకు  కూడా వర్తిస్తాయి.