వాట్సాప్, ఇన్స్ స్టాలోనూ చాట్ జీపీటీ సేవలు

వాట్సాప్, ఇన్స్ స్టాలోనూ చాట్ జీపీటీ సేవలు

రీసెంట్ డేస్ లో బాగా వినిపిస్తోన్న పేరు చాట్ జీపీటీ. మెక్రోసాఫ్ట్ ఏఐ ఆధారిత సేవలను విస్తరించడంలో భాగంగా స్మార్ట్ ఫోన్ యూజర్స్ బాగా వినియోగించే ఇన్స్ స్టాగ్రామ్, వాట్సాప్ లోనూ ఈ సెర్చ్ ఇంజిన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాట్ జీపీటీకి పాపులారిటీ రావడంతో పలు కీలక దిగ్గజ కంపెనీలు సైతం ఈ కొత్త టెక్నాలజీకి కన్వర్ట్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి పోటీగా 2022, నవంబర్ లో దీన్ని అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పటికే యూజర్స్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు అద్భుతంగా సమాధానాలిచ్చింది. 

ప్రస్తుతం మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగించే వాట్సాప్, మెస్సేంజర్, స్పాటిఫై, ఇన్ స్టాగ్రామ్ లాంటి యూజర్స్ కు కూడా చాట్ జీపీటీ తరహాలో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాయి ఆయా ఐటీ కంపెనీలు. గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ బార్డ్‌ పేరుతో చాట్‌ జీపీటీ తరహా ఏఐ టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు ఇదే బాటలో ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా ఇందు కోసం కంపెనీలో ఓ ఉన్నత స్థాయి ప్రొడక్ట్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్గ్‌ జుకర్‌ బర్గ్‌ ప్రకటించారు. అందులో భాగంగా మొదట వాట్సాప్‌, ఇన్‌స్టాలోనూ చాట్‌ జీపీటీ తరహా సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని స్పష్టం చేశారు.

ఆర్ధిక మాంద్యం పేరుతో ఇప్పటికే భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోన్న కంపెనీలు కూడా ఏఐ సాంకేతికతపై ఫోకస్ చేశాయి. అందుకు భారీగా పెట్టబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో ముఖ్యంగా స్నాప్‌చాట్‌, స్పాటిఫై లాంటివి ఉన్నాయి. ఈ యాప్స్ లోనూ చాట్‌ జీపీటీ తరహా సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇటీవలే.. లామా పేరుతో ఓ కొత్త లాంగ్వేజ్‌ మోడల్‌ను ఫేస్​ బుక్​ తీసుకురాగా..  దీనిపై పరిశోధనా బృందాన్ని ఏర్పాటు చేసింది. 

రాబోయే మూడు నెలల్లో అంటే.. 2023, జూన్, జూలై నాటికి వాట్సాప్, ఇన్ స్ట్రా యాప్స్ కూడా మీకు కావాల్సిన సమాచారాన్ని ఇట్టే చెప్పగలదు.. చూపించగలదు.. చదవించగలదు.. ఇదే జరిగితే మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను వాట్సాప్ వీలైనంత త్వరగా తీసుకురావాలనే ప్రయత్నాల్లో భాగంగా.. ఇప్పటికే అతి పెద్ద టీంను ఏర్పాటు చేసింది కంపెనీ