వాట్సాప్ లో సీక్రెట్ కోడ్.. దీని వల్ల ఉపయోగం ఏంటంటే..

వాట్సాప్ లో సీక్రెట్ కోడ్.. దీని వల్ల ఉపయోగం ఏంటంటే..

వాట్సప్ త్వరలో కొత్త ఫీచర్ పరిచయం చేయబోతోంది. చాట్ లను హైడ్ చేసే ఫీచర్ ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన వాట్పప్.. ఇపుడు వినియోగదారులకు మరింత సెక్యూరిటీని ఇచ్చే కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. దీంతో వినియోగదారులు తమ ఫోన్లను ఇతరులకు ఇచ్చిన కూడా.. వాట్సప్ చాట్ లను చూడకుండా దాచుకోవచ్చు. సెక్యూరిటీ కోడ్ పేరుతో వాట్సప్ కొత్త ఫీచర్ ను పరిచయం చేస్తోంది. యూజర్ ప్రైవసీ, చాట్ సెక్యూరిటీని పెంపెందించేందుకు ఈ ఫీచర్ ను రూపొందించారు. ఈ ఫీచర్ ను ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. త్వరలో ఈ ఫీచర్ ను బెటా టెస్టర్ లకు విడుదల చేస్తారు. 

WhatsApp సీక్రెట్ కోడ్ ఫీచర్ పనితీరు 

ఈ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్ చాట్ లకు పాస్ వర్డ్ పెట్టడం ద్వారా లాక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.ఇది మొదల WABetaInfo చే బ్లాక్ చేయబడిన చాట్ లను గుర్తిస్తుంది. యూజర్ సెర్చ్ బార్ లో పాస్ వర్డ్ టైప్ చేయడం ద్వారా ప్రొటెక్ట్ చేయబడిన చాట్ లను గుర్తించవచ్చు.   ఇతరుల డివైజ్ లలో కూడా ఈ చాట్ లను యాక్సెస్ పొందొచ్చు. పాస్ వర్డ్ ను ఒక పదం లేదా ఎమోజీని ఉపయోగించి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. 

WhatsApp ఇప్పటికే ఫింగర్ ప్రింట్ గుర్తింపు, ఫేస్ అన్ లాక్, పిన్ కోడ్  ద్వారా అప్లికేషన్ల బ్లాక్ చేసే సెక్యూరిటీ ఫీచర్ ను అందిస్తోంది. అదనంగా ఇప్పుడు సెక్యూరిటీ కోడ్ ఫీచర్ ద్వారా భద్రతను పెంచడమే కాకుండా.. బ్లాక్ చేసిన చాట్ లను గుర్తించడం, యాక్సెస్ చేయడం సులభతరం చేస్తుంది. చాట్ లాక్ వచ్చిన తర్వాత ఈ ఫీచర్ అభివృద్ది చేస్తు్న్నారు. కాంప్లిమెంటరీ డివైజ్‌లతో చాట్ లాక్‌ని ఇంటిగ్రేట్ చేయడంలో కూడా కంపెనీ చురుకుగా పని చేస్తోంది.సీక్రెట్ కోడ్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. బీటా టెస్టర్‌లకు కూడా అందుబాటులో లేదు. ఇది త్వరలో కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. 

WhatsApp చాట్-బ్లాకింగ్ ఫీచర్ ద్వారా కస్టమర్లు వారి చాట్ జాబితా నుండి అనుకున్న చాట్ లను దాచేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ను యాక్సెస్ చేయడానికి చాట్ ని తెరిచి, చాట్ సమాచారంపై నొక్కి చాట్ లాక్ సెలక్షన్ ను టాప్ చేసి కిందికి స్క్రోల్ చేయాలి. తద్వారా ఫీచర్ ను ఎనేబుల్ చేయాలి. ఢిఫాల్ట్ గా చాట్ లకు వేలిముద్ర లాక్ జోడించబడుతుంది. దీన్ని యాక్సెస్ చేస్తే చాట్ జాబితా ఎగువన ఫోల్డర్ లో చాట్ లు కనిపిస్తాయి. ఈ ఫోల్డర్ కు యాక్సెస్ పరిమితం చేయబడి ఉంటుంది. సెక్యూరిటీ లాక్ ద్వారా మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది.