Whatsapp : ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు

Whatsapp : ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు

టెక్ కంపెనీలు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యాప్స్, ఫీచర్స్, అప్ డేట్ చేస్తుంటాయి. బగ్స్ గుర్తించి వాటిని తొలగించడంతో పాటు కొత్త వెర్షన్లకు అప్ గ్రేడ్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే పాత సాఫ్ట్ వేర్ తో పని చేసే డివైజ్ లలో కొత్త వెర్షన్ యాప్స్ పనిచేయడం ఆగిపోతుంటాయి. ఇప్పుడు వాట్సాప్ విషయంలోనూ అదే జరిగింది. యాపిల్ సహా కొన్ని ఆండ్రాయిడ్ డివైజ్ లలో ఇవాళ్టి నుంచి (ఫిబ్రవరి1) వాట్సప్ పనిచేయదని కంపెనీ ప్రకటించారు. ఆ ఫోన్ల లిస్ట్ విడుదల చేసింది. 

యాపిల్: ఐఫోన్ 6తో పాటు దాని ముందు వెర్షన్, ఫస్ట్ జనరేషన్ SEల్లో వాట్సాప్ ఇక పనిచేయదు. 

శాంసంగ్: శాంసంగ్ గెలాక్సీ కోర్, శాంసంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్, శాంసంగ్ గెలాక్సీ S2, శాంసంగ్  గెలాక్సీ S3 మినీ, శాంసంగ్ గెలాక్సీ ట్రెండ్స్ II, శాంసంగ్ గెలాక్సీ X కవర్ 2

హువావే: హువావే అసెండ్ మేట్, హువావే అసెండ్ G 740, హువావే అసెండ్ D2, వికో సింక్ 5

ఎల్ జీ: LG ఆప్టిమస్ L3 II డ్యుయల్, LG ఆప్టిమస్ L5, LG ఆప్టిమస్ F5, LG ఆప్టిమస్ L3 II, LG ఆప్టిమస్ L7 II, LG ఆప్టిమస్ L5 డ్యుయల్, LG ఆప్టిమస్ L7 డ్యుయల్, LG ఆప్టిమస్ F3, LG ఆప్టిమస్ F3Q, LG ఆప్టిమస్ L2 II, LG ఆప్టిమస్ F6, LG యాక్ట్, LG లుసిడ్ 2, LG ఆప్టిమస్ F7

ఇవేకాకుండా సోనీ ఎక్స్ పీరియా M, లెనోవో 820, ఫెయా F1TH, వీన్కో డార్క్ నైట్, అర్చొస్ 53ప్లాటినమ్, ZTE V956-యుమి X2, ZTE గ్రాండ్ S ఫ్లెక్స్, ZTE గ్రాండ్ మెమొ ఫోన్లలో యాప్ పనిచేయదని వాట్సప్ ప్రకటించింది.