వాట్సాప్ అప్ డేట్ : అవతార్ ఎమోజీలు వచ్చేస్తున్నాయ్

వాట్సాప్ అప్ డేట్ : అవతార్ ఎమోజీలు వచ్చేస్తున్నాయ్

మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ వాట్సాప్ లో రోజుకో అప్ డేట్ తో మెటా యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ లో మరో కొత్త ఫీచర్ ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఐఓఎస్ (iOS), ఆండ్రాయిడ్( Android) యూజర్స్ కోసం యానిమేటెడ్ అవతార్‌లను పరిచయం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. యానిమేటెడ్ అవతార్ ఫీచర్ యాప్ భవిష్యత్తు లో అందుబాటులోకి వస్తుందని యూజర్స్ భావిస్తున్నారు. వాట్సాప్ డెవలప్‌మెంట్‌లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo ప్రకారం, Google Play Storeలో అందుబాటులో ఉన్న Android 2.23.15.6 అప్‌డేట్ కోసం తాజా WhatsApp బీటా యాప్ ను అప్ డేట్ చేయండని మెటా యాజమాన్యం చెలిపింది. ఈ క్రమంలో మెటా... వాట్సాప్ అవతార్ ప్యాక్ యానిమేటెడ్ వెర్షన్‌ను పరిచయం చేయాలని యోచిస్తోందనే వార్త సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

ఇటీవల, WhatsApp.. iOS, Androidలో అవతార్‌ల కోసం రెండు ఆప్షన్లను ప్రకటించింది. దీని వల్ల యూజర్స్ ఇప్పుడు ఫొటోతో అవతార్‌లను సులభంగా సృష్టించవచ్చు. ఇది ఆటోమేటిక్‌గా మారుతుంది. అదనంగా, యాప్ సెట్టింగ్‌ల నుంచి వారి అవతార్ కాన్ఫిగరేషన్‌ను కూడా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

యానిమేటెడ్ అవతార్‌ల విడుదల తేదీని వెల్లడించనప్పటికీ, ఇది ఫ్యూచర్ లో చేర్చబడుతుందని పలువురు భావిస్తున్నారు. యానిమేటెడ్ అవతార్‌లను పరిచయం చేయడానికి ముందు, WhatsApp యాప్‌లోని వివిధ అంశాలను మెరుగుపరచడంపై దృష్టి సారించింది. ఇటీవలి అప్‌డేట్‌లలో రీడిజైన్ చేయబడిన కీబోర్డ్, అప్‌డేట్ చేయబడిన GIF, స్టిక్కర్ పికర్, మెరుగైన నావిగేషన్ లాంటి అప్ డేట్ లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మరో కొత్త ఫీచర్‌ను కూడా పరిచయం చేస్తోంది. ఇది యూజర్స్ తమ ఫోన్ నంబర్‌లను ఉపయోగించి వాట్సాప్ వెబ్‌కి వారి ఖాతాలను లింక్ చేయడానికి అనుమతిస్తుంది. దీన్ని యాక్సెస్ చేయడానికి యూజర్స్.. లింక్ చేయబడిన మొబైల్ స్క్రీన్‌ను ఓపెన్ చేసి "ఫోన్ నంబర్‌తో లింక్" ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆ తర్వాత, వాట్సాప్ వెబ్ 8-అక్షరాల కోడ్‌ను రూపొందిస్తుంది. యూజర్స్ లింక్ చేసే ప్రక్రియను పూర్తి చేయడానికి వారి WhatsApp ఖాతాలోకి తప్పనిసరిగా నమోదు చేయాలి. "ఫోన్ నంబర్‌తో లింక్" ఫీచర్ తో ముందు నుంచి ఉన్న పర్మిషన్లతోనే, లిమిట్స్ తో సంబంధం లేకుండా ఎవరైనా ఇప్పుడు సులభంగా WhatsApp వెబ్‌కి కనెక్ట్ చేయవచ్చు.