డివిలియర్స్ ను కలిసిన రిషబ్ శెట్టి

 డివిలియర్స్ ను కలిసిన రిషబ్ శెట్టి

నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతార’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ ఊహించని విధంగా హిట్ అయ్యింది. దీంతో ‘కాంతార’ సినిమాను ఇతర భాషల్లోనూ విడుదల చేసింది. ప్రముఖ సినీ నటులు ‘కాంతార’ మూవీని చూసి ప్రశంసించారు. తాజాగా.. సౌతాఫ్రికా మాజీ అంతర్జాతీయ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ఏబీ డీవిలియర్స్ ను రిషబ్ శెట్టి కలిశారు. దీనికి సంబంధించిన విషయాన్ని  ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిషబ్ వెల్లడించారు. 

ఈ మూవీ అద్భుతంగా ఉందంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. బెంగళూరులో కాంతార చిత్రాన్ని చూసిన నిర్మలా సీతారామన్ ప్రశంసలతో ముంచెత్తారు. తన వాలంటీర్లు, శ్రేయోభిలాషులతో కలిసి బెంగళూరులోని ఓ థియేటర్‌లో ఆమె కాంతారా చిత్రాన్ని చూశారు.  హీరోగా చేస్తూ.. దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టిని నిర్మలా మెచ్చుకున్నారు. 

తెలుగు రైట్స్‌‌‌‌‌‌‌‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అక్టోబర్ 15న తెలుగులో విడుదలైంది.  రిషబ్ శెట్టి లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు, తనే స్వయంగా దర్శకత్వం వహించాడు. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరగందూర్ నిర్మాత. అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌నాథ్ సంగీతాన్ని అందించారు.